Telugu Global
Cinema & Entertainment

రవితేజ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న లయ కూతురు

వెంకీ, దుబాయ్ శ్రీను వంటి హిట్ సినిమాల తరువాత శ్రీను వైట్ల, రవితేజ కాంబినేషన్ లో వస్తున్న సినిమా “అమర్ అక్బర్ అంటోనీ”. ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉన్న శ్రీను వైట్ల ఈ సారి తనకి అలవాటు అయిన కామెడీని కాస్త పక్కన పెట్టి కొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్ తో ఈ సినిమాని తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా లో చిన్నపాటి ఇలియాన గా లయ కూతురు నటిస్తోందట. సినిమాలు వదిలేసి పెళ్లి చేసుకొని హాయిగా జీవితం […]

రవితేజ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న లయ కూతురు
X

వెంకీ, దుబాయ్ శ్రీను వంటి హిట్ సినిమాల తరువాత శ్రీను వైట్ల, రవితేజ కాంబినేషన్ లో వస్తున్న సినిమా “అమర్ అక్బర్ అంటోనీ”. ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉన్న శ్రీను వైట్ల ఈ సారి తనకి అలవాటు అయిన కామెడీని కాస్త పక్కన పెట్టి కొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్ తో ఈ సినిమాని తెరకెక్కించాడు.

అయితే ఈ సినిమా లో చిన్నపాటి ఇలియాన గా లయ కూతురు నటిస్తోందట. సినిమాలు వదిలేసి పెళ్లి చేసుకొని హాయిగా జీవితం గడుపుతున్న లయ కి ఒక పాప. ఇప్పుడు ఆ పాపనే చిన్నపాటి ఇలియన గా శ్రీనువైట్ల ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఒక ముఖ్యమైన సీన్ లో లయ కూతురు నటిస్తోందట.

మరి ఈ పాప తన క్యూట్ నటనతో ఎంత మందిని ఆకట్టుకుంటుందో చూడాలి. రవితేజ మూడు డిఫరెంట్ పాత్రల్లో నటించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేశారు. ఎస్.ఎస్.తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఎరోస్ సంస్థ ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 16 న రిలీజ్ చేస్తోంది.

First Published:  14 Nov 2018 11:07 PM GMT
Next Story