Telugu Global
Cinema & Entertainment

భలే కామెడీ.. నిశ్చితార్థం జరిగిందట

రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్ పెళ్లి ప్రక్రియ ప్రారంభమైంది. కొద్దిసేపటి కిందట తుళు వివాహ సంప్రదాయంలో ఇద్దరి పెళ్లి పూర్తయింది కూడా. ఇలాంటి టైమ్ లో దీపిక పదుకోన్ నుంచి ఓ ప్రకటన వచ్చింది. రణ్వీర్ కు తనకు నిశ్చితార్థం పూర్తయిందనేది ఈ ప్రకటన సారాంశం. దీంతో జనాలు ఒకటే నవ్వు. ఒకవైపు వివాహం జరుగుతుంటే, మరోవైపు కావాలనే ఇలా వ్యూహాత్మకంగా ఎంగేజ్ మెంట్ ప్రకటన విడుదల చేసింది దీపిక పదుకోన్. వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారని అందరికీ తెలుసు. […]

భలే కామెడీ.. నిశ్చితార్థం జరిగిందట
X
రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్ పెళ్లి ప్రక్రియ ప్రారంభమైంది. కొద్దిసేపటి కిందట తుళు వివాహ సంప్రదాయంలో ఇద్దరి పెళ్లి పూర్తయింది కూడా. ఇలాంటి టైమ్ లో దీపిక పదుకోన్ నుంచి ఓ ప్రకటన వచ్చింది. రణ్వీర్ కు తనకు నిశ్చితార్థం పూర్తయిందనేది ఈ ప్రకటన సారాంశం. దీంతో జనాలు ఒకటే నవ్వు. ఒకవైపు వివాహం జరుగుతుంటే, మరోవైపు కావాలనే ఇలా వ్యూహాత్మకంగా ఎంగేజ్ మెంట్ ప్రకటన విడుదల చేసింది దీపిక పదుకోన్.
వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారని అందరికీ తెలుసు. కానీ ఆ విషయాన్ని ఎక్కడా చెప్పలేదు ఈ జంట. వీళ్లిద్దరికీ నిశ్చితార్థం కూడా పూర్తయిందనే విషయం జనాలకు తెలుసు. కానీ ఆ విషయాన్ని కూడా చెప్పలేదు. చివరికి పెళ్లి సంగతుల్ని కూడా గుంభనంగా ఉంచింది ఈ జంట. ఇలాంటి టైమ్ లో తమకు నిశ్చితార్థం జరిగింటూ ప్రకటన విడుదల చేసి కామెడీ చేస్తోంది దీపిక.
ఇటలీలోని ఓ ఐలాండ్ లో వీళ్ల పెళ్లి గ్రాండ్ గా జరుగుతోంది. ఈరోజు తుళు సంప్రదాయ పద్ధతిలో వీళ్ల వివాహం జరిగింది. రేపు సిక్కు సంప్రదాయంలో మరోసారి పెళ్లి చేసుకోబోతోంది ఈ జంట.
First Published:  14 Nov 2018 9:29 PM GMT
Next Story