Telugu Global
NEWS

రూ. 3 కోట్లకు బేరం.... ఆడియో టేపు సంచలనం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల అమ్మకాల వ్యవహారం సంచలనంగా మారింది. టీడీపీ టికెట్లను ఎల్‌ రమణ అమ్ముకున్నారని కాంగ్రెస్‌ యువనేత కార్తీక్‌ రెడ్డి ఆరోపించగా… రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు మల్లేష్‌ సొంత పార్టీ పైనే బాంబు పేల్చారు. కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్త చరణ్‌దాస్ కుమారుడు సాగర్ టికెట్లు అమ్ముకున్నారని వెల్లడించారు. ఇబ్రహీంపట్నం టికెట్ కావాలంటే మూడు కోట్లు ఇవ్వాలని తనను భక్త చరణ్‌దాస్‌ కుమారుడు డిమాండ్ చేశారని వెల్లడించారు. అందుకు సంబంధించిన ఆడియో […]

రూ. 3 కోట్లకు బేరం.... ఆడియో టేపు సంచలనం
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల అమ్మకాల వ్యవహారం సంచలనంగా మారింది. టీడీపీ టికెట్లను ఎల్‌ రమణ అమ్ముకున్నారని కాంగ్రెస్‌ యువనేత కార్తీక్‌ రెడ్డి ఆరోపించగా… రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు మల్లేష్‌ సొంత పార్టీ పైనే బాంబు పేల్చారు.

కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్త చరణ్‌దాస్ కుమారుడు సాగర్ టికెట్లు అమ్ముకున్నారని వెల్లడించారు.

ఇబ్రహీంపట్నం టికెట్ కావాలంటే మూడు కోట్లు ఇవ్వాలని తనను భక్త చరణ్‌దాస్‌ కుమారుడు డిమాండ్ చేశారని వెల్లడించారు. అందుకు సంబంధించిన ఆడియో టేపును కూడా మల్లేష్ విడుదల చేసి సంచలనం సృష్టించారు.

స్క్రీనింగ్ కమిటీ వ్యవహారం కంచే చేను మేసినట్టుగా ఉందని మండిపడ్డారు. ఇబ్రహీంపట్నం టికెట్‌ను ప్రస్తుతం టీడీపీకి కేటాయించారు. అక్కడి నుంచి మహాకూటమి తరపున సామ రంగారెడ్డి పోటీ చేయబోతున్నారు.

First Published:  15 Nov 2018 5:29 AM GMT
Next Story