Telugu Global
NEWS

కాంగ్రెస్ కు కార్తీక్ రెడ్డి రాజీనామా....

తెలంగాణ మహాకూటమిలో కుమ్ములాటలు మొదలయ్యాయి. సీట్లు రాని వారు రెబల్స్‌గా బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారు. పార్టీ పెద్దలు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా డోన్ట్ కేర్ అంటున్నారు. ఈ జాబితాలోకి మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌ రెడ్డి కూడా చేరారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. ఇండిపెండెంట్ గా పోటీకి రెడీ అవుతున్నారు. కార్తీక్‌ రెడ్డి రాజేంద్రనగర్‌ టికెట్ ఆశించారు. కానీ కాంగ్రెస్ అధినాయకత్వం టికెట్ ఇవ్వలేదు. సబితా ఇంద్రారెడ్డికి మాత్రమే మహేశ్వరం […]

కాంగ్రెస్ కు కార్తీక్ రెడ్డి రాజీనామా....
X

తెలంగాణ మహాకూటమిలో కుమ్ములాటలు మొదలయ్యాయి. సీట్లు రాని వారు రెబల్స్‌గా బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారు. పార్టీ పెద్దలు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా డోన్ట్ కేర్ అంటున్నారు. ఈ జాబితాలోకి మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌ రెడ్డి కూడా చేరారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. ఇండిపెండెంట్ గా పోటీకి రెడీ అవుతున్నారు.

కార్తీక్‌ రెడ్డి రాజేంద్రనగర్‌ టికెట్ ఆశించారు. కానీ కాంగ్రెస్ అధినాయకత్వం టికెట్ ఇవ్వలేదు. సబితా ఇంద్రారెడ్డికి మాత్రమే మహేశ్వరం టికెట్ ఇచ్చి సరిపెట్టింది. కుటుంబానికి ఒక్క సీటు మాత్రమేనని తేల్చేసింది.

అయితే ఈ పరిణామాన్ని కార్తీక్ రెడ్డి అంగీకరించడం లేదు. నీతులు తమ కుటుంబానికి మాత్రమేనా అని అనుచరుల వద్ద ప్రశ్నిస్తున్నారు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి కుటుంబం రెండు సీట్లు తీసుకుని మిగిలిన వారికి మాత్రం నీతులు చెప్పడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇండిపెండెంట్‌గా రాజేంద్రనగర్‌ నుంచి పోటీకి సిద్దమయ్యారు.

కాంగ్రెస్ తనకు టికెట్‌ నిరాకరించిన నేపథ్యంలో అనుచరులతో శంషాబాద్‌లో కార్తీక్ రెడ్డి సమావేశం అయ్యారు. వెనక్కు తగ్గేది లేదని బరిలో దిగి సత్తా చూపిస్తామని ఆయన అంటున్నారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి లేఖను పార్టీ పెద్దలకు పంపించారు.

రాజేంద్ర నగర్‌ లోనే కాదు చాలా చోట్ల మహాకూటమిలో కాంగ్రెస్‌, టీడీపీ నుంచి రెబల్స్ బరిలో దిగుతున్నారు. ఇబ్రహీంపట్నం టీడీపీ రెబల్ అభ్యర్థిగా రొక్క భీంరెడ్డి నామినేషన్ వేశారు. ఇబ్రహీంపట్నం టికెట్‌ను సామరంగా రెడ్డికి టీడీపీ కేటాయించింది. సామారంగారెడ్డి కూడా ఇబ్రహీంపట్నం నుంచి పోటీకి అయిష్టంగానే ఉన్నారు. ఆయన ఎల్బీనగర్ టికెట్ ఆశించారు.

First Published:  15 Nov 2018 2:06 AM GMT
Next Story