Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రియ?

బాలకృష్ణ – క్రిష్ కలయికలో తెరకెక్కుతున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం “ఎన్టీఆర్ “. ఇప్పటికే 75% షూటింగ్ పూర్తి చేసుకుని సంక్రాంతికి ముస్తాబవుతోంది ఈ చిత్రం. ఈ చిత్రాన్ని రెండు పార్ట్స్ గా విడుదల చేయబోతుండటం వల్ల ఈ చిత్రం పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం యొక్క ప్రచార చిత్రాలు సినీ వర్గాల వారిని మరియు అభిమానులని భారీ అంచనాల వైపు పరుగులు పెట్టిస్తున్నాయి. జనవరి 14న “కథానాయకుడు”గా మరియు జనవరి 26న “మహానాయకుడు”గా […]

ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రియ?
X

బాలకృష్ణ – క్రిష్ కలయికలో తెరకెక్కుతున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం “ఎన్టీఆర్ “. ఇప్పటికే 75% షూటింగ్ పూర్తి చేసుకుని సంక్రాంతికి ముస్తాబవుతోంది ఈ చిత్రం. ఈ చిత్రాన్ని రెండు పార్ట్స్ గా విడుదల చేయబోతుండటం వల్ల ఈ చిత్రం పైన భారీ అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే ఈ చిత్రం యొక్క ప్రచార చిత్రాలు సినీ వర్గాల వారిని మరియు అభిమానులని భారీ అంచనాల వైపు పరుగులు పెట్టిస్తున్నాయి. జనవరి 14న “కథానాయకుడు”గా మరియు జనవరి 26న “మహానాయకుడు”గా రానున్నాడు బాలకృష్ణ.

ఇప్పటికే ఈ చిత్రంలో చాలా మంది సీనియర్ నటీనటులు నటించటం విశేషం. దర్శకుడు క్రిష్ కి ఇదివరకే బాలయ్యతో పని చేసిన అనుభవం “గౌతమి పుత్ర శాతకర్ణి” తో ఉంది.

అందుకే దర్శకుడు తేజని పక్కన పెట్టి మరీ క్రిష్ ని ఆహ్వానించాడు బాలకృష్ణ. ఇందులో ఇప్పటికే విద్యాబాలన్, రకుల్ ప్రీత్, రానా, సుమంత్, నిత్యామీనన్, తమన్నా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం లో “దానవీరశూరకర్ణ”సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం.

ఇందులో మరో ఇద్దరు సినీ తారలు కీలక పాత్రలు పోషిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. వాటిలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు “శ్రియ”. బాలకృష్ణ తో ఇది వరకే “గౌతమిపుత్ర శాతకర్ణి” లో నటించిన ఆమె ఇప్పుడు ఇందులో కూడా కీ రోల్ పోషిస్తున్నట్టు వినికిడి. మరో పేరుకూడా పరిశీలనలో ఉంది. ఇక ఆ పాత్రకి ఎవరిని తీసుకుంటారో చూడాలి.

First Published:  13 Nov 2018 10:52 PM GMT
Next Story