Telugu Global
NEWS

ఎన్నికల వేళ.... భూపాలపల్లిలో మావోల పోస్టర్లు

మావోల టెన్షన్ మళ్లీ మైదలైంది. ఛత్తీస్ గఢ్ లో తొలి విడత ఎన్నికలకు కొద్ది గంటల ముందుగా, ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు, ఎన్నికల సిబ్బంది లక్ష్యంగా బాంబులను పేల్చారు. ఇప్పుడు తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లిలో మావోల పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. మావోల ‘యాక్షన్’ టీం అంటూ పోలీసులు కూడా పోస్టర్లను అంటించారు. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకుల్లో ఆందోళన పెరుగుతోంది. మావోయిస్టులు యాక్టివ్ మోడ్ లోకి వచ్చేశారు. ఎన్నికలు వాయిదా పడాలంటూ ఇటీవల వెంకటాపురం, వాజేడు, చిట్యాల […]

ఎన్నికల వేళ.... భూపాలపల్లిలో మావోల పోస్టర్లు
X

మావోల టెన్షన్ మళ్లీ మైదలైంది. ఛత్తీస్ గఢ్ లో తొలి విడత ఎన్నికలకు కొద్ది గంటల ముందుగా, ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు, ఎన్నికల సిబ్బంది లక్ష్యంగా బాంబులను పేల్చారు. ఇప్పుడు తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లిలో మావోల పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. మావోల ‘యాక్షన్’ టీం అంటూ పోలీసులు కూడా పోస్టర్లను అంటించారు. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకుల్లో ఆందోళన పెరుగుతోంది.

మావోయిస్టులు యాక్టివ్ మోడ్ లోకి వచ్చేశారు. ఎన్నికలు వాయిదా పడాలంటూ ఇటీవల వెంకటాపురం, వాజేడు, చిట్యాల మండలాల్లో రహదారులపై బ్యానర్లు కట్టారు, కరపత్రాలను పంచారు. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న చెల్పూర్‌లో గోడపత్రికలు వేశారు. సోమవారం ఎన్‌కౌంటర్‌ కొద్దిలో తప్పినట్లు తెలుస్తోంది. కొంత మంది మావోయిస్టులు తప్పించుకుని పారిపోయారు. తాడ్వాయి మండలం జలగలవంచలో… గొత్తికోయలు ఉండే ప్రాంతంలో మావోయిస్టులు మోహరించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఏటూరునాగారం, తాడ్వాయి అడవులను జల్లెడ పడుతున్నారు. గిరిజనులు కూడా ఆందోళనలో మునిగిపోయారు. .

మావోయిస్టు పార్టీ ‘యాక్షన్‌ టీం’ ఏర్పాటు చేసింది. ఇందులోని నలుగురు జలగలవంచ ప్రాంతంలో వారం నుంచి ఆశ్రయం పొందుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దళ సభ్యుడు భద్రు అలియాస్ రమేష్‌తో పాటు మరో ముగ్గురు పస్రా, గోవిందరావుపేట ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు తెలుసుకున్నారు. భద్రుని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం మాత్రం జరుగుతోంది.

మరోవైపు మావోయిస్టుల యాక్షన్ టీం చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. ఆచూకీ అందిస్తే రూ.5లక్షలు ఇస్తామంటూ కరీంనగర్‌ పోలీసులు గోడపత్రికలు వేశారు. యాక్షన్‌ టీం ఫొటోలు పోలీసులకు ఎలా దొరికాయన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతం సుకుమా జిల్లాలోని చింతల్‌నార్‌ మావోయిస్టులు అమర్చిన బాంబులు పేలి మంగళవారం ఒక వృద్ధుడు మృతి చెందాడు. నిమ్మాపూర్‌ గ్రామ శివారులో పోలీసు సిబ్బందినే లక్ష్యంగా పొలాల్లో ఆ బాంబులు అమర్చినట్లు సుకుమా జిల్లా ఎస్పీ అభిషేక్‌ మీనా తెలిపారు.

మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మావోల కదలికలతో రాజకీయ నేతల్లో కలవరం మొదలైంది. ప్రచారాలకు ముందుగానే చెప్పి వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. పోలింగ్ రోజు పటిష్ఠ భద్రత కల్పిస్తున్నట్లు చెబుతున్నారు.

First Published:  14 Nov 2018 2:20 AM GMT
Next Story