Telugu Global
NEWS

కేసీఆర్ అదే సెంటిమెంట్.... నామినేషన్ దాఖలు

సెంటిమెంట్లు, జాతకాలను ఎక్కువగా నమ్మే కేసీఆర్ మరోసారి అదే పంథాను కొనసాగించారు. బుధవారం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఇష్టదైవమైన కోనాయిపల్లిలోని శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన గజ్వేల్ ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. కేసీఆర్‌ తెలంగాణ శాసనసభను రద్దు చేయడంతో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు అనివార్యమయ్యాయి. డిసెంబరు 7న ఎన్నికలు జరగనున్నాయి. 11వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి 100కు పైగా స్థానాలు […]

కేసీఆర్ అదే సెంటిమెంట్.... నామినేషన్ దాఖలు
X

సెంటిమెంట్లు, జాతకాలను ఎక్కువగా నమ్మే కేసీఆర్ మరోసారి అదే పంథాను కొనసాగించారు. బుధవారం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఇష్టదైవమైన కోనాయిపల్లిలోని శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన గజ్వేల్ ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.

కేసీఆర్‌ తెలంగాణ శాసనసభను రద్దు చేయడంతో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు అనివార్యమయ్యాయి. డిసెంబరు 7న ఎన్నికలు జరగనున్నాయి. 11వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి 100కు పైగా స్థానాలు వస్తాయని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

1985 నుంచి ప్రతి ఎన్నిక సందర్భంగా కేసీఆర్‌ కోనాయిపల్లి వెంకన్న ఆలయంలో పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఆ తరువాతే నామినేషన్ దాఖలు చేస్తారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని చేపట్టినప్పుడు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాకనే టీఆర్ఎస్ పార్టీ ప్రకటన చేశారు.

అప్పటి నుంచి ఇదే సెంటిమెంట్‌ను కేసీఆర్‌ కొనసాగిస్తున్నారు. ఈ రోజు ఆలయానికి వచ్చిన సందర్భంలో కేసీఆర్ వెంట హరీశ్ రావు ఉన్నారు. మంత్రులు, నేతలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

First Published:  14 Nov 2018 5:24 AM GMT
Next Story