Telugu Global
NEWS

జూ. ఎన్టీఆర్‌ చెక్‌కు బాబు కొత్త వ్యూహం.... తెరపైకి సుహాసిని

ఎన్టీఆర్‌ ఫ్యామిలీలో దాదాపు అందరినీ చంద్రబాబు దారికి తెచ్చుకున్నారు. నందమూరి హరికృష్ణ రూపంలో చంద్రబాబుకు అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదురయ్యేవి. ఆయన మరణం తర్వాత పరిస్థితి మారిపోయింది. హరికృష్ణ ఉంటే ఆయన పర్యవేక్షణలో జూనియర్ ఎన్టీఆర్‌ ఎప్పటికైనా టీడీపీ నాయకత్వం కోసం పోటీ పడేవారన్న అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు హరికృష్ణ మరణం జూనియర్ ఎన్టీఆర్‌కు తీరని లోటే. ఈ నేపథ్యంలో హరికృష్ణ కుటుంబాన్ని కూడా ఆకర్షించేందుకు చంద్రబాబు వ్యూహ రచన చేస్తున్నారు. అందులో భాగంగా తొలుత కల్యాణ్ […]

జూ. ఎన్టీఆర్‌ చెక్‌కు బాబు కొత్త వ్యూహం.... తెరపైకి సుహాసిని
X

ఎన్టీఆర్‌ ఫ్యామిలీలో దాదాపు అందరినీ చంద్రబాబు దారికి తెచ్చుకున్నారు. నందమూరి హరికృష్ణ రూపంలో చంద్రబాబుకు అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదురయ్యేవి.

ఆయన మరణం తర్వాత పరిస్థితి మారిపోయింది. హరికృష్ణ ఉంటే ఆయన పర్యవేక్షణలో జూనియర్ ఎన్టీఆర్‌ ఎప్పటికైనా టీడీపీ నాయకత్వం కోసం పోటీ పడేవారన్న అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు హరికృష్ణ మరణం జూనియర్ ఎన్టీఆర్‌కు తీరని లోటే.

ఈ నేపథ్యంలో హరికృష్ణ కుటుంబాన్ని కూడా ఆకర్షించేందుకు చంద్రబాబు వ్యూహ రచన చేస్తున్నారు. అందులో భాగంగా తొలుత కల్యాణ్ రామ్‌ను రాజకీయంగా తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్ పల్లి నుంచి పోటీ చేయాల్సిందిగా తొలుత కల్యాణ్‌ రామ్ ను టీడీపీ నేతల బృందం వెళ్లి కలిసింది. కానీ అందుకు కల్యాణ్ రామ్ సున్నితంగానే తిరస్కరించారు. ఈ నేపథ్యంలో హరికృష్ణ కుమార్తె సుహాసిని పేరును తెరపైకి తెస్తున్నారు.

ఆమెను బరిలో దింపేందుకు టీడీపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. ఈ విషయాన్ని టీడీపీ సీనియర్ నేత ఒకరు ధృవీకరించారు. కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా కూకట్ పల్లి స్థానం టీడీపీకే దక్కింది.

ఇప్పటికే పెద్దిరెడ్డి అభ్యర్థిత్వాన్ని అక్కడ ప్రకటించారు. కానీ హరికృష్ణ కుమార్తె సుహాసిని పోటీకి అంగీకరిస్తే ఆమెను బరిలో దింపుతారని చెబుతున్నారు. సుహాసిని పోటీకి అంగీకరిస్తే … అది పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్‌ను ఒంటరిని చేయడమే అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నందమూరి ఫ్యామిలీ నుంచి తనకు గానీ, తన కుమారుడికి గానీ రాజకీయంగా ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకే చంద్రబాబు హరికృష్ణ కుటుంబసభ్యులను దువ్వుతున్నారని చెబుతున్నారు.

First Published:  13 Nov 2018 11:23 PM GMT
Next Story