Telugu Global
NEWS

రేవంత్‌ రెడ్డి బ్యాచ్‌కు నాలుగే

తనతో పాటు భారీగా టీడీపీ నేతలను కాంగ్రెస్‌లోకి వెంటబెట్టుకెళ్లిన రేవంత్ రెడ్డి… ఎన్నికల్లో కనీసం తన వర్గానికి 14 సీట్లు కేటాయించాలని తొలి నుంచీ పట్టుబడుతూ వచ్చారు. అనుకున్న స్థాయిలో తన వారికి టికెట్లు కేటాయించకపోతే దేనికైనా రెడీ అన్నట్టు లీకులు ఇప్పించుకున్నారు. కానీ కాంగ్రెస్‌ ప్రకటించిన తొలి జాబితాలో రేవంత్ రెడ్డి వర్గానికి నాలుగు సీట్లు మాత్రమే దక్కాయి. కొడంగల్‌ నుంచి రేవంత్‌ రెడ్డికి టికెట్ కేటాయించారు. ములుగు టికెట్ సీతక్కకు, చొప్పదండి టికెట్‌ మేడిపల్లి సత్యంకు, పెద్దపల్లి […]

రేవంత్‌ రెడ్డి బ్యాచ్‌కు నాలుగే
X

తనతో పాటు భారీగా టీడీపీ నేతలను కాంగ్రెస్‌లోకి వెంటబెట్టుకెళ్లిన రేవంత్ రెడ్డి… ఎన్నికల్లో కనీసం తన వర్గానికి 14 సీట్లు కేటాయించాలని తొలి నుంచీ పట్టుబడుతూ వచ్చారు. అనుకున్న స్థాయిలో తన వారికి టికెట్లు కేటాయించకపోతే దేనికైనా రెడీ అన్నట్టు లీకులు ఇప్పించుకున్నారు.

కానీ కాంగ్రెస్‌ ప్రకటించిన తొలి జాబితాలో రేవంత్ రెడ్డి వర్గానికి నాలుగు సీట్లు మాత్రమే దక్కాయి. కొడంగల్‌ నుంచి రేవంత్‌ రెడ్డికి టికెట్ కేటాయించారు. ములుగు టికెట్ సీతక్కకు, చొప్పదండి టికెట్‌ మేడిపల్లి సత్యంకు, పెద్దపల్లి టికెట్ విజయ రమణారావుకు ఇచ్చారు.

స్టేషన్ ఘనపూర్‌ టికెట్‌ను దొమ్మాటిసాంబయ్యకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ కాంగ్రెస్ లెక్కచేయలేదు. ఇక్కడ సింగపూర్ ఇందిరకు టికెట్ కేటాయించారు.

సూర్యాపేట టికెట్‌ను తనతో పాటు కాంగ్రెస్‌లో చేరిన పటేల్ రమేష్‌ రెడ్డికి ఇవ్వాలని రేవంత్ రెడ్డి పట్టుబట్టారు. కానీ సూర్యాపేట టికెట్ మాజీ మంత్రి ఆర్‌. దామోదర్‌రెడ్డికే ఇవ్వడం ద్వారా రేవంత్ రెడ్డికి మొండి చేయి చూపారు.

టీడీపీ నుంచి వచ్చిన అరికెల నర్సారెడ్డికి కూడా టికెట్ ఇప్పించాలని రేవంత్ రెడ్డి భావించారు… కానీ నిజామాబాద్ అర్బన్‌ స్థానానికి తొలి జాబితాలో అభ్యర్థిని ప్రకటించలేదు.

First Published:  12 Nov 2018 8:59 PM GMT
Next Story