Telugu Global
Cinema & Entertainment

పెళ్లి ఫొటోల ఖరీదు రూ.18 కోట్లు

ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. వ్యక్తిగత స్థాయిలో జరిగే ఈ పెళ్లికి కూడా కార్పొరేట్ లుక్ తీసుకొచ్చింది ప్రియాంక చోప్రా. పెళ్లికి సంబంధించిన ఫొటోలను అమ్మకానికి పెట్టింది. తాజా సమాచారం ప్రకారం, ప్రియాంక-నిక్ ల పెళ్లి ఫొటోల డీల్ 18 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. ముంబయికి చెందిన ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ ఈ పెళ్లిఫొటోల డీల్ ను దక్కించుకుంది. అయితే ఇది కేవలం ఫొటోలకు సంబంధించిన […]

పెళ్లి ఫొటోల ఖరీదు రూ.18 కోట్లు
X

ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. వ్యక్తిగత స్థాయిలో జరిగే ఈ పెళ్లికి కూడా కార్పొరేట్ లుక్ తీసుకొచ్చింది ప్రియాంక చోప్రా. పెళ్లికి సంబంధించిన ఫొటోలను అమ్మకానికి పెట్టింది. తాజా సమాచారం ప్రకారం, ప్రియాంక-నిక్ ల పెళ్లి ఫొటోల డీల్ 18 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది.

ముంబయికి చెందిన ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ ఈ పెళ్లిఫొటోల డీల్ ను దక్కించుకుంది. అయితే ఇది కేవలం ఫొటోలకు సంబంధించిన డీల్ మాత్రమే. వీడియో తీసుకునే రైట్స్ ను మరో కంపెనీకి అప్పగించారు. వచ్చే నెలలో జోధ్ పూర్ లో ప్రియాంక-నిక్ పెళ్లి చేసుకోబోతున్నారు.

కేవలం వీడియోలు, ఫొటోస్ మాత్రమే కాకుండా.. పెళ్లి దుస్తులు, సెట్, భోజనాలు.. ఇలా ఎన్నో యాంగిల్స్ లో కార్పొరేట్ డీల్స్ చేసుకుందట ప్రియాంక. ఓవరాల్ గా ఈ పెళ్లితో ప్రియాంక-నిక్ లకు అటుఇటుగా 50 కోట్ల రూపాయల సమకూరబోతున్నట్టు టాక్.

పెళ్లి తర్వాత కొన్నాళ్ల పాటు పూర్తిగా అమెరికాలోనే ఉండాలని నిర్ణయించుకుంది ఈ జంట. ఈ మేరకు ఇప్పటికే కాలిఫోర్నియాలో ఓ అందమైన భవంతిని వీళ్లు లీజుకు తీసుకున్నారు. అందులో కొన్నాళ్ల పాటు గడిపిన తర్వాత తిరిగి ఇండియా వచ్చి, కొత్త సినిమా షూటింగ్స్ లో పాల్గొంటుంది ప్రియాంక చోప్రా.

First Published:  12 Nov 2018 9:56 PM GMT
Next Story