Telugu Global
NEWS

జ‌న‌గామ నుంచి కోదండ‌రాం పోటీ !

తెలంగాణ జ‌న‌స‌మితి అధినేత కోదండ‌రాం పోటీపై స‌స్పెన్స్ వీడింది. జ‌న‌గామ నుంచి కోదండ‌రాం పోటీ చేయ‌బోతున్నారు. ఈమేర‌కు తెలంగాణ జ‌న‌స‌మితి క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ జ‌న‌స‌మితి ఫేస్‌బుక్ పేజీలో ఈ విష‌యాన్నిపోస్ట్ చేశారు. మ‌రోవైపు కాంగ్రెస్ అభ్య‌ర్థుల లిస్ట్‌ను ఈ రోజు విడుద‌ల చేయ‌బోతున్నారు. దీంతో పాటు కోదండ‌రాం పోటీపై ప్ర‌క‌టించ‌బోతున్నారు. 65 మంది లిస్ట్‌ను కాంగ్రెస్ ప్ర‌క‌టించింది. ఈ లిస్ట్‌లో జ‌న‌గామ‌ను పెండింగ్‌లో పెట్టారు. టీజేఎస్ కోస‌మే ఈ సీటును పెండింగ్‌లో పెట్టార‌ని తెలుస్తోంది. దీంతో […]

జ‌న‌గామ నుంచి కోదండ‌రాం పోటీ !
X

తెలంగాణ జ‌న‌స‌మితి అధినేత కోదండ‌రాం పోటీపై స‌స్పెన్స్ వీడింది. జ‌న‌గామ నుంచి కోదండ‌రాం పోటీ చేయ‌బోతున్నారు. ఈమేర‌కు తెలంగాణ జ‌న‌స‌మితి క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ జ‌న‌స‌మితి ఫేస్‌బుక్ పేజీలో ఈ విష‌యాన్నిపోస్ట్ చేశారు.

మ‌రోవైపు కాంగ్రెస్ అభ్య‌ర్థుల లిస్ట్‌ను ఈ రోజు విడుద‌ల చేయ‌బోతున్నారు. దీంతో పాటు కోదండ‌రాం పోటీపై ప్ర‌క‌టించ‌బోతున్నారు.

65 మంది లిస్ట్‌ను కాంగ్రెస్ ప్ర‌క‌టించింది. ఈ లిస్ట్‌లో జ‌న‌గామ‌ను పెండింగ్‌లో పెట్టారు. టీజేఎస్ కోస‌మే ఈ సీటును పెండింగ్‌లో పెట్టార‌ని తెలుస్తోంది. దీంతో కోదండ‌రాం ఇక్క‌డినుంచి పోటీ చేస్తార‌ని తెలంగాణ జ‌న‌స‌మ‌తి ప్ర‌క‌టించింది.

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండ‌రాం ఎక్కడ నుంచి పోటీ చేస్తారు. ఆయ‌న ఏ సీటును ఎంచుకుంటారు. ఆయ‌న ఎన్నిక‌ల లెక్క‌లు ఏంటి? అనే విష‌యం స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. తెలంగాణ జ‌న‌సమితి నేత‌లే కాదు…. ఇతర పార్టీల నేతలు కూడా కోదండ‌రాం ఎక్క‌డి నుంచి పోటీ చేస్తార‌నే విష‌యాన్ని ఆరా తీశారు.

ముఖ్యంగా అధికార‌ప‌క్షం కోదండ‌రాం ఏ సీటు నుంచి బ‌రిలోకి దిగుతారో అని ఎదురుచూస్తోంది. ఇప్పుడు జ‌న‌గామ నుంచి ఆయ‌న పోటీ చేయ‌డం ఖాయం కావ‌డంతో ఆ నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు ఎలా మారుతాయి… పొన్నాల పోటీ చేస్తారా? లేదా అనేది స‌స్పెన్స్‌గా మారింది.

First Published:  12 Nov 2018 10:45 PM GMT
Next Story