Telugu Global
Cinema & Entertainment

కట్టప్ప, శివగామి రొమాన్స్

కట్టప్ప, శివగామి రొమాన్స్ చేస్తే ఎలా ఉంటుంది. ఓ మంచి మాస్ బీట్ కు వీళ్లిద్దరూ కలిసి చిందేస్తే ఎలా ఉంటుంది. ఊహించుకోవడానికే కష్టంగా ఉంది కదా. కానీ ఆ ఊహ నిజమౌతోంది. శివగామి, కట్టప్ప కలిసి డ్యూయట్స్ పాడుకుంటున్న సినిమా ఒకటి సిద్ధమైంది. తమిళ్ లో పార్టీ అనే సినిమా తీశాడు దర్శకుడు వెంకట్ ప్రభు. ఆ సినిమాను అదే పేరుతో తెలుగులో కూడా విడుదల చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోహీరోయిన్లను పక్కనపెడితే.. రెండు కీలకపాత్రల్లో […]

కట్టప్ప, శివగామి రొమాన్స్
X

కట్టప్ప, శివగామి రొమాన్స్ చేస్తే ఎలా ఉంటుంది. ఓ మంచి మాస్ బీట్ కు వీళ్లిద్దరూ కలిసి చిందేస్తే ఎలా ఉంటుంది. ఊహించుకోవడానికే కష్టంగా ఉంది కదా. కానీ ఆ ఊహ నిజమౌతోంది. శివగామి, కట్టప్ప కలిసి డ్యూయట్స్ పాడుకుంటున్న సినిమా ఒకటి సిద్ధమైంది.

తమిళ్ లో పార్టీ అనే సినిమా తీశాడు దర్శకుడు వెంకట్ ప్రభు. ఆ సినిమాను అదే పేరుతో తెలుగులో కూడా విడుదల చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోహీరోయిన్లను పక్కనపెడితే.. రెండు కీలకపాత్రల్లో సత్యరాజ్, రమ్యకృష్ణ కనువిందు చేయబోతున్నారు. పాతికేళ్ల కుర్రాడి పాత్రలో సత్యరాజ్, పడుచుపిల్లగా రమ్యకృష్ణ ఇందులో కనిపించబోతున్నారు.

కేవలం ఎప్పీయరెన్స్ మాత్రమే కాదు, సినిమాలో వీళ్లిద్దరి మధ్య ఓ యుగళ గీతం కూడా ఉంది. ఆ రొమాంటిక్ సాంగ్ టోటల్ సినిమాకే హైలెట్ అంటోంది యూనిట్. అంతా బాగానే ఉంది కానీ, టాలీవుడ్ ప్రేక్షకులకు సత్యరాజ్ అంటే ఇప్పటికీ కట్టప్పే. అటు శివగామిగా రమ్యకృష్ణ నటనను కూడా మరిచిపోలేరు. ఇలాంటి ఇద్దరు వ్యక్తులు కలిసి ‘పార్టీ’ చేసుకుంటే జనాలు తట్టుకోగలరా..

First Published:  13 Nov 2018 7:05 AM GMT
Next Story