Telugu Global
NEWS

కాసు మహేష్‌ అరెస్ట్

గుంటూరు జిల్లా గురజాల వైసీపీ ఇన్‌చార్జ్ కాసు మహేష్‌ రెడ్డి మరోసారి హౌస్ అరెస్ట్ అయ్యారు. నరసరావుపేటలో ఆయన్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పిడుగురాళ్ల మున్సిపాలిటీలో చోటు చేసుకుంటున్న పరిణామాలకు వ్యతిరేకంగా వైసీపీ…. పిడుగురాళ్ల మున్సిపాలిటీ ముందు ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలను నరసరావుపేట, పిడుగురాళ్ల, గురజాలలో పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేశారు. ఇటీవల పిడుగురాళ్లలో ఇంటి పన్నును ఏకంగా 270 శాతం పెంచారు. విజయవాడలాంటి చోట 20 శాతం పెంచి పిడుగురాళ్లలో […]

కాసు మహేష్‌ అరెస్ట్
X

గుంటూరు జిల్లా గురజాల వైసీపీ ఇన్‌చార్జ్ కాసు మహేష్‌ రెడ్డి మరోసారి హౌస్ అరెస్ట్ అయ్యారు. నరసరావుపేటలో ఆయన్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పిడుగురాళ్ల మున్సిపాలిటీలో చోటు చేసుకుంటున్న పరిణామాలకు వ్యతిరేకంగా వైసీపీ…. పిడుగురాళ్ల మున్సిపాలిటీ ముందు ధర్నాకు పిలుపునిచ్చింది.

ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలను నరసరావుపేట, పిడుగురాళ్ల, గురజాలలో పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేశారు. ఇటీవల పిడుగురాళ్లలో ఇంటి పన్నును ఏకంగా 270 శాతం పెంచారు.

విజయవాడలాంటి చోట 20 శాతం పెంచి పిడుగురాళ్లలో ఏకంగా 270 శాతం పెంచడంపై ప్రజలు, ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు మున్సిపాలిటీ సమావేశం అత్యవసరంగా ఏర్పాటు చేసి 60 సిమెంట్ రోడ్లకు బిల్లులు మంజూరు చేయించేందుకు ప్రయత్నించారని కాసు ఆరోపించారు.

వేసిన రోడ్లకు బిల్లులు చేసుకునేందుకు కుట్ర చేశారని ఆ విషయాన్ని వైసీపీ వెలుగులోకి తెచ్చిందన్నారు. ఇంటి పన్ను కూడా పెంచి వీలైనంత దోచుకుని వెళ్లేందుకు టీడీపీ నేతలు పథక రచన చేశారని ఆరోపించారు. దీనికి నిరసనగా పోలీసుల అనుమతితోనే తాము ధర్నాకు సిద్ధమయ్యామన్నారు. కానీ తెల్లవారుజామునే పోలీసులు వచ్చి తమను హౌస్ అరెస్ట్ చేశారన్నారు.

పోలీసులు కూడా తామేమీ చేయలేకపోతున్నామని… తమను టీడీపీ నేతలు సెక్యూరిటీ గార్డులుగా మార్చేశారని వాపోతున్నారని కాసు మహేష్ చెప్పారు. పల్నాడు ప్రాంతంలో ఉన్న వైసీపీ నేతలపై కేసులు, అరెస్ట్‌లు కొత్తేమీ కాదని… వీటన్నింటిని ఎదుర్కొంటామని కాసు మహేష్ చెప్పారు.

First Published:  13 Nov 2018 12:15 AM GMT
Next Story