Telugu Global
NEWS

మనమంతా టీడీపీ కార్యసాధకులం, బాబును గెలిపించుకోవాలి " కమ్మ సమ్మేళనంలో జేసీ

ఎన్నికలు సమీపిస్తుండడంతో తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీ వివిధ కులాలను ఆకర్షించే పనిలో ఉంది. ప్రబోధానంద స్వామి అలియాస్ పెద్దన్నచౌదరి ఎపిసోడ్‌తో తమకు దూరమైన వర్గాలను తిరిగి దగ్గర చేసేందుకు పావులు కదుపుతోంది. జేసీ దివాకర్ రెడ్డి పలుమార్లు సొంత కులాన్ని తక్కువ చేసేలా మాట్లాడిన నేపథ్యంలో…. సొంత కులం నుంచి పెద్దగా ఆయనకు మద్దతు లభించడం లేదు. ఈ నేపథ్యంలో టీడీపీకి అనుకూలంగా ఉండే వర్గాలను మచ్చిక చేసుకునే పనిలో జేసీ ఫ్యామిలీ ఉంది. ఇప్పటికే తాడిపత్రి […]

మనమంతా టీడీపీ కార్యసాధకులం, బాబును గెలిపించుకోవాలి  కమ్మ సమ్మేళనంలో జేసీ
X

ఎన్నికలు సమీపిస్తుండడంతో తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీ వివిధ కులాలను ఆకర్షించే పనిలో ఉంది. ప్రబోధానంద స్వామి అలియాస్ పెద్దన్నచౌదరి ఎపిసోడ్‌తో తమకు దూరమైన వర్గాలను తిరిగి దగ్గర చేసేందుకు పావులు కదుపుతోంది.

జేసీ దివాకర్ రెడ్డి పలుమార్లు సొంత కులాన్ని తక్కువ చేసేలా మాట్లాడిన నేపథ్యంలో…. సొంత కులం నుంచి పెద్దగా ఆయనకు మద్దతు లభించడం లేదు. ఈ నేపథ్యంలో టీడీపీకి అనుకూలంగా ఉండే వర్గాలను మచ్చిక చేసుకునే పనిలో జేసీ ఫ్యామిలీ ఉంది.

ఇప్పటికే తాడిపత్రి నుంచి వచ్చే ఎన్నికల్లో అశ్మిత్ రెడ్డిని బరిలో దింపుతున్నట్టు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి ప్రకటించారు. అందుకు తగ్గట్టు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. తాజాగా కమ్మకులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో జేసీ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.

మనమంతా తెలుగుదేశం పార్టీ కార్య సాధకులం…. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబునాయుడిని మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. మరో 20 ఏళ్ల పాటు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండేలా పనిచేయాలి అని కమ్మ కుల సమ్మేళనంలో పిలుపునిచ్చారు ప్రభాకర్ రెడ్డి. తన వల్ల కమ్మ కులస్తులెవరైనా నొచ్చుకుని ఉంటే వారికి క్షమాపణ చెబుతున్నానన్నారు. ఒకరిద్దరి వల్లే కమ్మ సంఘం భ్రష్టుపట్టిందని వ్యాఖ్యానించారు.

రాజకీయాలంటే తనకు పెద్దగా ఇష్టం లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో తన తనయుడు జేసీ అశ్మిత్‌రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్నారు. తాడిపత్రి ప్రజలకు సేవ చేసుకునేందుకు వచ్చే ఎన్నికల్లో మున్సిపల్ కౌన్సిలర్‌గా తాను పోటీ చేస్తానని ప్రకటించారు.

First Published:  12 Nov 2018 8:54 PM GMT
Next Story