Telugu Global
NEWS

మూడో స్థానానికి పడతామన్న భయం... జనసేన వైపు మాజీ మంత్రి

జనసేన ప్రభావం ఉంటుందని భావిస్తున్న గోదావరి, విశాఖ జిల్లాలో నేతలు కొత్తదారులు వెతుకుతున్నారు. కాంగ్రెస్‌, టీడీపీ పొత్తు దాదాపు ఖాయమని తెలిసినా కాంగ్రెస్‌ సీనియర్ నేతలు ఆ పార్టీలో ఉండేందుకు సుముఖత చూపడం లేదు. ఈ జాబితాలోకి మాజీమంత్రి పసుపులేటి బాలరాజు చేరారు.  కాంగ్రెస్‌ సీనియర్ నేత కావడంతో  వచ్చే ఎన్నికల్లో టీడీపీ- కాంగ్రెస్‌ పొత్తులో భాగంగా పాడేరు టికెట్‌ బాలరాజుకు ఖాయమని కాంగ్రెస్‌ పెద్దలు సూచనలు కూడా ఇచ్చారు. కానీ  కాంగ్రెస్‌- టీడీపీ కూటమి తరపున […]

మూడో స్థానానికి పడతామన్న భయం... జనసేన వైపు మాజీ మంత్రి
X

జనసేన ప్రభావం ఉంటుందని భావిస్తున్న గోదావరి, విశాఖ జిల్లాలో నేతలు కొత్తదారులు వెతుకుతున్నారు. కాంగ్రెస్‌, టీడీపీ పొత్తు దాదాపు ఖాయమని తెలిసినా కాంగ్రెస్‌ సీనియర్ నేతలు ఆ పార్టీలో ఉండేందుకు సుముఖత చూపడం లేదు. ఈ జాబితాలోకి మాజీమంత్రి పసుపులేటి బాలరాజు చేరారు.

కాంగ్రెస్‌ సీనియర్ నేత కావడంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ- కాంగ్రెస్‌ పొత్తులో భాగంగా పాడేరు టికెట్‌ బాలరాజుకు ఖాయమని కాంగ్రెస్‌ పెద్దలు సూచనలు కూడా ఇచ్చారు. కానీ కాంగ్రెస్‌- టీడీపీ కూటమి తరపున పోటీ చేసినా గెలుపు దాదాపు ఆసాధ్యమని బాలరాజు భావనగా చెబుతున్నారు. వైసీపీకి వెళ్థామంటే అక్కడ వెకెన్సీలు కనిపించడం లేదు. దీంతో జనసేన వైపు ఆయన చూస్తున్నారు. ఇటీవల లోతుగా నిర్వహించిన ఒక సర్వేలో గోదావరి జిల్లాల్లో వైసీపీ మొదటి స్థానంలో, జనసేన రెండో స్థానంలో ఉందని తేలింది.

టీడీపీ మూడో స్థానానికి పడిపోయిందని సదరు సర్వేలో క్షుణ్ణంగా వివరించారు. ఈ నేపథ్యంలో ఆ పక్కనే ఉన్న విశాఖ జిల్లాలోనూ ఈక్వేషన్లు ఇలాగే ఉంటాయని అంచనా వేస్తున్నారు. దాంతో బాలరాజు ప్రస్తుత పరిస్థితుల్లో జనసేనలోకి వెళ్దామంటూ అనుచరుల ముందు ప్రతిపాదన పెట్టారు. కాంగ్రెస్‌లోనే కొనసాగితే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని… ప్రస్తుత పరిస్థితుల్లో మనకు జనసేన మాత్రమే అవకాశంగా కనిపిస్తోంది అంటూ కార్యకర్తలకు వివరించారు.

బాలరాజు ప్రతిపాదనకు మెజారిటీ అనుచరులు తలూపారు. దీంతో ఆయన త్వరలోనే జనసేనలోకి వెళ్లడం ఖాయమని చెబుతున్నారు.

First Published:  9 Nov 2018 4:58 AM GMT
Next Story