Telugu Global
NEWS

ఈనెల 11న ఏపీ మంత్రివర్గ విస్తరణ

అసెంబ్లీ ఎన్నికలు మరో ఆరు నెలలు మాత్రమే ఉండగా చంద్రబాబు తన కేబినెట్‌ను ఇప్పుడు విస్తరిస్తున్నారు. మరో మూడు నెలల తర్వాత ఏ క్షణమైనా ఈసీ రంగ ప్రవేశం చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో మైనార్టీ, గిరిజన వ్యక్తులు మంత్రులుగా లేని కేబినెట్‌గా చంద్రబాబు కేబినెట్‌ రికార్డులకు ఎక్కింది. ఎన్నిసార్లు ముస్లిం మైనార్టీలు, గిరిజనులు డిమాండ్ చేసినా నాలుగున్నరేళ్లుగా వారికి కేబినెట్‌లో అవకాశం ఇవ్వలేదు. కానీ ఎన్నికలు సమీపిస్తుండడంతో వారిని బుజ్జగించేందుకు ఈనెల 11న కేబినెట్‌ విస్తరణకు పూనుకున్నారు. […]

ఈనెల 11న ఏపీ మంత్రివర్గ విస్తరణ
X

అసెంబ్లీ ఎన్నికలు మరో ఆరు నెలలు మాత్రమే ఉండగా చంద్రబాబు తన కేబినెట్‌ను ఇప్పుడు విస్తరిస్తున్నారు. మరో మూడు నెలల తర్వాత ఏ క్షణమైనా ఈసీ రంగ ప్రవేశం చేయవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో మైనార్టీ, గిరిజన వ్యక్తులు మంత్రులుగా లేని కేబినెట్‌గా చంద్రబాబు కేబినెట్‌ రికార్డులకు ఎక్కింది. ఎన్నిసార్లు ముస్లిం మైనార్టీలు, గిరిజనులు డిమాండ్ చేసినా నాలుగున్నరేళ్లుగా వారికి కేబినెట్‌లో అవకాశం ఇవ్వలేదు.

కానీ ఎన్నికలు సమీపిస్తుండడంతో వారిని బుజ్జగించేందుకు ఈనెల 11న కేబినెట్‌ విస్తరణకు పూనుకున్నారు. ఖాళీగా ఉన్న రెండు స్థానాల్లో ఒకటి మైనార్టీకి, మరొకటి గిరిజనుడికి కేటాయించనున్నారు.

ఈనెల 11న ఉదయం 11.30కు కేబినెట్ విస్తరణ జరుగుతుంది. ఇటీవల మావోయిస్టుల చేతిలో చనిపోయిన కిడారి సర్వేశ్వరరావు కుమారుడిని గిరిజన కోటాలో మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. కిడారి కుమారుడు ఏ సభలోనూ సభ్యుడు కానప్పటికి ఆరు నెలల వెసులుబాటును ఆసరాగా చేసుకుని మంత్రిని చేయనున్నారు.

ఎలాగో మరో ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయి కాబట్టి కిడారి కుమారుడు పోటీ చేసి గెలవాల్సిన అవసరం లేదు. గిరిజన కోటాలో మంత్రి పదవి హామీతో పార్టీ ఫిరాయించిన గిడ్డి ఈశ్వరికి చంద్రబాబు నో చెప్పినట్టు తెలుస్తోంది.

మైనార్టీ కోటాలో కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఫరూక్‌ను కేబినెట్‌లోకి తీసుకోనున్నారు. మైనార్టీ కోటాలో మంత్రులవుతామన్న ఉద్దేశంతో పార్టీ ఫిరాయించిన జలీల్‌ ఖాన్, చాంద్‌ బాషాకు ఆ కల కనీసం ఆరు నెలల పాటు కూడా నెరవేరే సూచనలు లేకుండా పోయాయి.

First Published:  9 Nov 2018 5:50 AM GMT
Next Story