Telugu Global
NEWS

హైదరాబాద్‌లో భారీగా డబ్బు పట్టివేత.... ఏ పార్టీదో !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్‌లో భారీగా డబ్బు పట్టుపడింది. ఏకంగా ఏడు కోట్ల 71లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్‌లోని రోడ్‌ నెంబర్‌ 12లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ డబ్బు పట్టుబడింది. నగదుతో పాటు నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నగదు ఎక్కడిది అన్న దానిపై వారు సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. తాము వ్యాపారం చేస్తుంటామని పట్టుబడిన నిందితులు […]

హైదరాబాద్‌లో భారీగా డబ్బు పట్టివేత.... ఏ పార్టీదో !
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్‌లో భారీగా డబ్బు పట్టుపడింది. ఏకంగా ఏడు కోట్ల 71లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్‌లోని రోడ్‌ నెంబర్‌ 12లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ డబ్బు పట్టుబడింది. నగదుతో పాటు నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నగదు ఎక్కడిది అన్న దానిపై వారు సరైన సమాధానం చెప్పలేకపోయారు.

ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. తాము వ్యాపారం చేస్తుంటామని పట్టుబడిన నిందితులు రాజ్‌ పురోహిత్, సునీల్‌కుమార్, అశిష్‌, అజాంలు చెప్పినా…. వారి మాటలకు పొంతన లేకపోవడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రివాల్వర్‌తో పాటు వొల్వో కారును స్వాధీనం చేసుకున్నారు.

ఈ డబ్బును ముంబై నుంచి తీసుకొచ్చినట్టు భావిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నేతలెవరైనా ఈ డబ్బును తెప్పించారా అన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఈ కోణంలోనూ…. పట్టుబడిన నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.

First Published:  7 Nov 2018 4:25 AM GMT
Next Story