Telugu Global
NEWS

40:40.... సీట్ల కేటాయింపులో కాంగ్రెస్ సంచలన నిర్ణయం

మహాకూటమి సీట్ల సర్దుబాటు తేలక మిత్రపక్షాల్లో ఆందోళన ఏర్పడింది. సీపీఐ, టీజేఎస్ లు సొంతంగా ప్రణాళికలు, అభ్యర్థులను కూడా తయారు చేసుకున్నాయి. కాంగ్రెస్ కావలసినన్ని సీట్లు ఇవ్వకపోతే ఒంటరిగా బరిలోకి దిగేందుకు ఈ రెండు పార్టీలు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని వార్ రూంలో తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు, స్క్రీనింగ్ కమిటీ ఢిల్లీ పెద్దలు, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి కుంతియ మహాకూటమి సీట్ల సర్దుబాటు లెక్క తేల్చే పనిలో పడ్డారు. తాజాగా అందుతున్న సమాచారం […]

40:40.... సీట్ల కేటాయింపులో కాంగ్రెస్ సంచలన నిర్ణయం
X

మహాకూటమి సీట్ల సర్దుబాటు తేలక మిత్రపక్షాల్లో ఆందోళన ఏర్పడింది. సీపీఐ, టీజేఎస్ లు సొంతంగా ప్రణాళికలు, అభ్యర్థులను కూడా తయారు చేసుకున్నాయి. కాంగ్రెస్ కావలసినన్ని సీట్లు ఇవ్వకపోతే ఒంటరిగా బరిలోకి దిగేందుకు ఈ రెండు పార్టీలు నిర్ణయించాయి.

ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని వార్ రూంలో తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు, స్క్రీనింగ్ కమిటీ ఢిల్లీ పెద్దలు, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి కుంతియ మహాకూటమి సీట్ల సర్దుబాటు లెక్క తేల్చే పనిలో పడ్డారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

మహాకూటమిలో కాంగ్రెస్ టికెట్ల కేటాయింపులో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్స్ గా పోటీచేసిన వారికి ఈసారి టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. 2014లో కాంగ్రెస్ రెబల్ గా పోటీచేసి అనంతరం కాంగ్రెస్ లో చేరిన చాలా మందికి ఈసారి టికెట్ ఇవ్వమని తేల్చేశారు. ఈ పరిణామం కాంగ్రెస్ లోని ఆశావహుల్లో గుబులు రేపుతోంది. వారు మరోసారి రెబల్ గా పోటీచేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఇక కాంగ్రెస్ అంటేనే రెడ్డి అని పేర్లు వినపడుతున్న నేపథ్యంలో ఆ విమర్శ నుంచి తప్పించుకోవడానికి సామాజిక కోణంలో టికెట్లు ఇవ్వాలని ఢిల్లీలో కాంగ్రెస్ కోర్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగా బీసీలకు 40 టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. మరో 40 స్థానాల్లో రెడ్డి, వెలమ, కమ్మ, బ్రాహ్మణ, వైశ్య, మైనార్టీలకు చోటు కల్పించాలని నిర్ణయించారట.

మహాకూటమి సీట్ల లెక్క తేల్చాక మొత్తం పోటీచేసే అభ్యర్థుల లిస్ట్ ను దీపావళి కానుకగా రేపు ప్రకటించాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించారట. ఆలస్యమైతే సీపీఐ, టీజేఎస్ కూటమి వదిలివెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నాయి. అందుకే తాజాగా సీట్ల లెక్క తేల్చే పనిలో కాంగ్రెస్ పెద్దలు పడ్డారు.

First Published:  6 Nov 2018 8:54 AM GMT
Next Story