Telugu Global
National

షారుఖ్‌పై సిక్కుల కేసు

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌కు అనుకోని చిక్కు వచ్చిపడింది. షారూఖ్‌ రాబోయే సినిమా ‘జీరో’లో తమ మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ (డీఎస్‌జీఎంసీ) జనరల్‌ సెక్రటరీ మంజిందర్‌ సింగ్‌ సిర్సా ఫిర్యాదు దాఖలు చేశారు. ఢిల్లీలోని నార్త్‌ ఎవెన్యూ పోలీస్‌స్టేషన్‌లో ఈ మేరకు ఓ కేసు నమోదైంది. తమ సామాజిక వర్గానికి చెందిన వారి నుంచి తమకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయని, అందుకే పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయాల్సి వచ్చిందని […]

షారుఖ్‌పై సిక్కుల కేసు
X

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌కు అనుకోని చిక్కు వచ్చిపడింది. షారూఖ్‌ రాబోయే సినిమా ‘జీరో’లో తమ మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ (డీఎస్‌జీఎంసీ) జనరల్‌ సెక్రటరీ మంజిందర్‌ సింగ్‌ సిర్సా ఫిర్యాదు దాఖలు చేశారు.

ఢిల్లీలోని నార్త్‌ ఎవెన్యూ పోలీస్‌స్టేషన్‌లో ఈ మేరకు ఓ కేసు నమోదైంది. తమ సామాజిక వర్గానికి చెందిన వారి నుంచి తమకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయని, అందుకే పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయాల్సి వచ్చిందని మంజిందర్‌ తెలిపారు. సిక్కు శిరస్త్రాణాన్ని ధరించి షారూఖ్‌ నటించిన భాగాన్ని ఈ సినిమా ప్రోమోగా ప్రదర్శిస్తున్నారని, అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కుల మనోభావాలను దెబ్బతీస్తోందని మంజిందర్‌ వివరించారు.

షారూఖ్‌ ఈ సినిమా కోసం ధరించిన ‘గత్రా శిరస్త్రాణం’ సిక్కులలో ఎంతో ఉన్నతస్థానానికి చేరుకున్న అమృతధారి సిక్కు మాత్రమే ధరిస్తారని, అలాంటిది ఓ సినిమా కోసం ఆ సాంప్రదాయాన్ని అవహేళన చేయడం దారుణమని మంజిందర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. షారూఖ్‌ ఖాన్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఇంకా కత్రినా కైఫ్, అనుష్క శర్మ కూడా నటిస్తున్నారు. ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

First Published:  6 Nov 2018 7:30 AM GMT
Next Story