Telugu Global
Health & Life Style

ఇద్దరమ్మాయిలకు మగబిడ్డ.... వైద్య చరిత్రలోనే అద్భుతం....

గే, లెస్బియన్లు.. స్వలింగ సంపర్కులు.. వీరికి పిల్లలు పుట్టే అవకాశాలుండవు.. ఎందుకంటే ఆడవారు మగవారుగా…. మగవారు ఆడవాళ్లుగా మారిపోయేలా కొందరు ఆపరేషన్లు చేయించుకుంటారు. సో వీరికి పిల్లలు అసాధ్యం. కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ఓ జంట… ఓ బిడ్డకు జన్మ కూడా ఇచ్చేసింది. వైద్య చరిత్రలోనే ఇదో అద్భుతంగా చెబుతున్నారు. ఈ ఆశ్చర్యపరిచే ఘటన అమెరికా దేశంలోని ఉత్తర టెక్సాస్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. టెక్సాస్ లోని అష్లేయింగ్ కౌల్టర్, బ్లిస్ కౌల్టర్ అనే ఇద్దరు […]

ఇద్దరమ్మాయిలకు మగబిడ్డ.... వైద్య చరిత్రలోనే అద్భుతం....
X

గే, లెస్బియన్లు.. స్వలింగ సంపర్కులు.. వీరికి పిల్లలు పుట్టే అవకాశాలుండవు.. ఎందుకంటే ఆడవారు మగవారుగా…. మగవారు ఆడవాళ్లుగా మారిపోయేలా కొందరు ఆపరేషన్లు చేయించుకుంటారు. సో వీరికి పిల్లలు అసాధ్యం.

కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ఓ జంట… ఓ బిడ్డకు జన్మ కూడా ఇచ్చేసింది. వైద్య చరిత్రలోనే ఇదో అద్భుతంగా చెబుతున్నారు. ఈ ఆశ్చర్యపరిచే ఘటన అమెరికా దేశంలోని ఉత్తర టెక్సాస్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

టెక్సాస్ లోని అష్లేయింగ్ కౌల్టర్, బ్లిస్ కౌల్టర్ అనే ఇద్దరు అమ్మాయిలు కొన్ని సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం 2015లో వీరు వివాహం చేసుకున్నారు. ఇద్దరూ స్వలింగ సంపర్కులే కావడంతో పిల్లలు కలగలేదు. కానీ బ్లిస్ కౌల్టర్ పిల్లలు కనాలని కోరుకుంది. ఇద్దరం ఆడవాళ్లం కావడంతో సంతానం ఎలా కనాలని ఆలోచించింది.

అమెరికాలోని ప్రఖ్యాత డాక్టర్లను సంప్రదించి పిల్లలు పుట్టే అవకాశాలపై చర్చించారు. వారి కోరికను విన్న డాక్టర్లు ఓ ఐడియాకు రూపకల్పన చేశారు. వారిద్దరి అండాలను సేకరించారు. ఓ పురుషుడి వీర్య కణాలతో ఫలదీకరణం చేశారు. అండాన్ని రూపొందించారు.

ఈ పిండాన్ని మొదట బ్లిస్ గర్భాశయంలో ఐదురోజులపాటు ఉంచారు. ఆ తర్వాత దాన్ని తీసి అష్లేయింగ్ గర్భాశయంలో ప్రవేశపెట్టారు. ఇలా వీరిద్దరి గర్భంలో పొదిగి ఇద్దరి రక్తం పంచుకున్న బిడ్డ డెలివరీ అయ్యింది. పండంటి మగబిడ్డ జన్మించాడు. వీరిద్దరికి కలిసి పుట్టిన బిడ్డకు స్టేటాన్స్ అని పేరు పెట్టారు.

ఇలా ఇద్దరి తల్లుల కడుపు పంచుకొని పుట్టిన బిడ్డ మెడికల్ హిస్టరీ లోనే అద్భుతమని… అరుదైన ప్రయోగమని వైద్యులు చెబుతున్నారు.

First Published:  4 Nov 2018 8:40 PM GMT
Next Story