Telugu Global
NEWS

పరిపూర్ణానంద 20వేల ఓట్ల కొనుగోలు.... కథనాన్ని ఖండించిన చానల్‌

తెలంగాణలో ఎన్నికల వేళ పార్టీల మధ్య ఎత్తులు పై ఎత్తులు ఊపందుకున్నాయి. ప్రత్యర్థులు ఎక్కడ దొరుకుతారా? అని పార్టీలు కాచుకుకూర్చున్నాయి. నోరు జారినా, అనకూడని మాట అన్నా అంతే…. వెంటనే సోషల్ మీడియాలోకి వాటిని వదిలి రచ్చ చేస్తున్నారు. కొన్ని సృష్టించి మరీ జనంలోకి పంపుతున్నారు. తాజాగా బీజేపీ నేత పరిపూర్ణానందకి, టీఆర్‌ఎస్‌కు మధ్య కొత్త పంచాయతీ నడుస్తోంది. టీఆర్‌ఎస్‌కు చెందిన నమస్తే తెలంగాణ పత్రిక… పరిపూర్ణనంద ఓట్లు కొనుగోలు గురించి మాట్లాడారంటూ ఒక కథనాన్ని ప్రచురించింది. […]

పరిపూర్ణానంద 20వేల ఓట్ల కొనుగోలు.... కథనాన్ని ఖండించిన చానల్‌
X

తెలంగాణలో ఎన్నికల వేళ పార్టీల మధ్య ఎత్తులు పై ఎత్తులు ఊపందుకున్నాయి. ప్రత్యర్థులు ఎక్కడ దొరుకుతారా? అని పార్టీలు కాచుకుకూర్చున్నాయి. నోరు జారినా, అనకూడని మాట అన్నా అంతే…. వెంటనే సోషల్ మీడియాలోకి వాటిని వదిలి రచ్చ చేస్తున్నారు. కొన్ని సృష్టించి మరీ జనంలోకి పంపుతున్నారు. తాజాగా బీజేపీ నేత పరిపూర్ణానందకి, టీఆర్‌ఎస్‌కు మధ్య కొత్త పంచాయతీ నడుస్తోంది.

టీఆర్‌ఎస్‌కు చెందిన నమస్తే తెలంగాణ పత్రిక… పరిపూర్ణనంద ఓట్లు కొనుగోలు గురించి మాట్లాడారంటూ ఒక కథనాన్ని ప్రచురించింది. ఇటీవల చౌటుప్పల్‌లో రోడ్‌ షో నిర్వహించిన పరిపూర్ణానంద… వాహనం పైనే అనుచరులకు కొన్ని సూచనలు చేశారు. ఈ వీడియోను ఆయనకు చెందిన భారత్‌ టుడే చానల్‌ ప్రసారం చేసింది. అయితే సదరు వీడియోలో పరిపూర్ణానంద చేసిన వ్యాఖ్యలు ప్రజలను అవమానించేలా ఉన్నాయంటూ నమస్తే తెలంగాణ కథనాన్ని ప్రచురించింది.

” రూ. 200 ఇస్తే చాలు జనం ఎగబడి మీటింగ్‌కు వస్తారు. ఓట్లు వేస్తారు. వస్తే 200 ఇవ్వాలి. లేకుంటే రారు. డబ్బులు ఇక్కడ వారు ఇవ్వరు. మనమే ఇవ్వాలి. 20వేల ఓట్లు వస్తే చాలు… 200చొప్పున ఇస్తే 20వేల ఓట్లు తప్పకుండా వస్తాయి” అంటూ ప్రచార వాహనంలో తన పక్కనే ఉన్న వ్యక్తులకు పరిపూర్ణానంద సూచించారని నమస్తే తెలంగాణ కథనం. ఈ మాటలను భారత్‌ టుడే చానలే ప్రసారం చేసిందని కూడా నమస్తే తెలంగాణ వెల్లడించింది.

టీఆర్ఎస్ మీడియా కథనాలను పరిపూర్ణానందకు చెందిన భారత్‌ టుడే చానల్ ఖండించింది. స్వామి అనని మాటలను అన్నట్టుగా టీ న్యూస్, నమస్తే తెలంగాణ ప్రచారం చేస్తున్నాయని మండిపడింది. పరిపూర్ణానంద ఏమన్నారో చూడండి అంటూ ఆయన వ్యాఖ్యలను మరోసారి ప్రసారం చేసింది భారత్ టుడే.

First Published:  5 Nov 2018 6:00 AM GMT
Next Story