Telugu Global
NEWS

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో కాల్పులు.... ఐదుగురు మావోల మృతి

ఏపీలో ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోముల హత్యలు.. చత్తీస్ ఘడ్ లో జవాన్లు, డీడీ కెమెరామెన్ హత్యలు, ఒడిశాల మందుపాతరలు… ఇలా ఆంధ్రా-ఒడిశా-చత్తీస్ ఘడ్ అడవుల్లో విస్తరించిన మావోయిస్టులకు తాజాగా గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఒడిశాలోని మల్కాన్ గిరి జిల్లా బెజ్జింగ్ వాడ అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఈ ఉదయం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను పోలీసులు […]

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో కాల్పులు.... ఐదుగురు మావోల మృతి
X

ఏపీలో ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోముల హత్యలు.. చత్తీస్ ఘడ్ లో జవాన్లు, డీడీ కెమెరామెన్ హత్యలు, ఒడిశాల మందుపాతరలు… ఇలా ఆంధ్రా-ఒడిశా-చత్తీస్ ఘడ్ అడవుల్లో విస్తరించిన మావోయిస్టులకు తాజాగా గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

ఒడిశాలోని మల్కాన్ గిరి జిల్లా బెజ్జింగ్ వాడ అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఈ ఉదయం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఎమ్మెల్యే కిడారి హత్య అనంతరం ఏపీ పోలీసులు-ఒడిశా పోలీసులతో కలిసి రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో ఎప్పటికప్పుడు నిఘా పెంచారు. ఇరు వర్గాలు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. ఒడిశాలో కదలికలకు ఆ రాష్ట్ర పోలీసులు…. ఆంధ్రా బార్డర్ లో అయితే ఏపీ పోలీసులు అప్రమత్తమవుతున్నారు. మావోలను టార్గెట్ చేసి ఇరు రాష్ట్రాలు సంయుక్తంగా కూడా కూబింగ్ జరుపుతున్నాయి.

ఆ కోవలోనే ఈరోజు బెజ్జంగ్‌ వాడ అటవీ ప్రాంతంలో మావోల కదలికలను గుర్తించిన పోలీసులు చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోలు మరణించగా.. చాలా మంది ఆయుధాలు వదిలి పారిపోయారు. ఘటన స్థలంలో భారీగా ఆయుధాలు దొరికిన దృష్ట్యా దాదాపు 30మందికి పైగానే మావోలు తప్పించుకున్నట్టు సమాచారం. వీరికోసం కూబింగ్ మొదలు పెట్టారు పోలీసులు. మరింత మంది ఈ దాడిలో చనిపోయినట్లు వార్తలొస్తున్నాయి.

First Published:  4 Nov 2018 11:46 PM GMT
Next Story