Telugu Global
NEWS

పార్టీ పెట్టడం, సీన్‌ అయ్యాక సినిమాలు తీసుకోవడం కామనే " చినరాజప్ప

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఏపీ హోంమంత్రి చినరాజప్ప సెటైర్లు వేశారు. పార్టీ పెట్టడం, సీన్‌ అయిపోయాక  సినిమాలు తీసుకోవడం వారికి అలవాటేనని ఎద్దేవా చేశారు. పవన్‌ కల్యాణ్‌ కూడా చిరంజీవిలాగే చేస్తారేమో అని ఎద్దేవా చేశారు.  పవన్‌ వల్లే టీడీపీ గెలిచిందని చెప్పడంలో అర్థం లేదన్నారు. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకోవడం సరైన చర్యే అని సమర్ధించుకున్నారు. రాష్ట్రానికి న్యాయం చేస్తారన్న నమ్మకంతోనే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నట్టు చెప్పుకొచ్చారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేం‍ద్రంలో ఎవరో ఒకరి […]

పార్టీ పెట్టడం, సీన్‌ అయ్యాక సినిమాలు తీసుకోవడం కామనే  చినరాజప్ప
X

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఏపీ హోంమంత్రి చినరాజప్ప సెటైర్లు వేశారు. పార్టీ పెట్టడం, సీన్‌ అయిపోయాక సినిమాలు తీసుకోవడం వారికి అలవాటేనని ఎద్దేవా చేశారు.

పవన్‌ కల్యాణ్‌ కూడా చిరంజీవిలాగే చేస్తారేమో అని ఎద్దేవా చేశారు. పవన్‌ వల్లే టీడీపీ గెలిచిందని చెప్పడంలో అర్థం లేదన్నారు. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకోవడం సరైన చర్యే అని సమర్ధించుకున్నారు.

రాష్ట్రానికి న్యాయం చేస్తారన్న నమ్మకంతోనే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నట్టు చెప్పుకొచ్చారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేం‍ద్రంలో ఎవరో ఒకరి సహకారం ఉండాలని వ్యాఖ్యానించారు. మరి బీజేపీ తరహాలోనే కాంగ్రెస్‌ చేస్తే ఏంటి పరిస్థితి అని ప్రశ్నించగా ఆయన స్పందించలేదు.

First Published:  5 Nov 2018 4:12 AM GMT
Next Story