Telugu Global
Cinema & Entertainment

సూర్యకాంతం'గా నిహారిక

మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది నిహారిక కొణిదెల. మొదట్లో యాంకరింగ్ వైపు దృష్టి పెట్టిన కూడా ఆ తరువాత నటిగా సినిమాలు చేస్తూ వస్తుంది. నిహారిక తొలిసారి హీరోయిన్ గా నటించిన సినిమా “ఒక మనసు”. నాగ శౌర్య హీరోగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా తరువాత సుమంత్ అశ్విన్ తో కలిసి “హ్యాపీ వెడ్డింగ్” అనే సినిమాలో నటించింది. ఈ […]

సూర్యకాంతంగా నిహారిక
X

మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది నిహారిక కొణిదెల. మొదట్లో యాంకరింగ్ వైపు దృష్టి పెట్టిన కూడా ఆ తరువాత నటిగా సినిమాలు చేస్తూ వస్తుంది. నిహారిక తొలిసారి హీరోయిన్ గా నటించిన సినిమా “ఒక మనసు”. నాగ శౌర్య హీరోగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా తరువాత సుమంత్ అశ్విన్ తో కలిసి “హ్యాపీ వెడ్డింగ్” అనే సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా నిహరికకి హీరోయిన్ గా బ్రేక్ తీసుకొని రాలేదు.

అయితే ఇప్పుడు నిహారిక ఎలాగైన హిట్టు కొట్టాలి అని చెప్పి “సూర్యకాంతం” లా మారింది. అవును నిహారిక నటిస్తున్న తదుపరి సినిమా పేరు “సూర్యకాంతం”. నిహరికతో ఇది వరకు ముద్దా పప్పు అవకాయ్ లాంటి వెబ్ సిరీస్ ని డైరెక్ట్ చేసిన ప్రనిత్ బ్రహ్మందపల్లీ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఫైట్ మాస్టర్ విజయ్ కొడుకు రాహుల్ విజయ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో పేరుకు మాత్రమే హీరో… ఎందుకంటే సినిమా కథ మొత్తం నిహారిక చుట్టే తిరుగుతుంది అని టాక్. మరి ఎంతో కాలంగా హిట్టు కోసం ఎదురుచూస్తున్న నిహారిక ఈ సినిమాతో అయిన హిట్టు కొడుతుందో లేదో చూడాలి.

First Published:  5 Nov 2018 12:28 AM GMT
Next Story