Telugu Global
Cinema & Entertainment

రాహుల్ రవీంద్రన్ ని సైడ్ చేసిన నాగార్జున

“అందాల రాక్ష‌సి” సినిమాతో హీరోగా ఆక‌ట్టుకుని మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న యువ హీరో రాహుల్ ర‌వీంద్ర‌న్ “చి.ల‌.సౌ” సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారిన విష‌యం అందరికి తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవ్వకున్న కూడా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు మాత్రం అందుకుంది. రాహుల్ ర‌వీంద్ర‌న్ క‌థ‌లో చూపించిన కొత్త‌దనం నాగార్జున‌కు న‌చ్చి త‌న కోసం ఓ స్ర్కిప్ట్ రెడీ చేయ‌మ‌ని బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చాడు కూడా. అయితే ఇటీవ‌ల నాగార్జున‌కు తను రాసుకున్న క‌థ చెప్పాడ‌ట‌ […]

రాహుల్ రవీంద్రన్ ని సైడ్ చేసిన నాగార్జున
X

“అందాల రాక్ష‌సి” సినిమాతో హీరోగా ఆక‌ట్టుకుని మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న యువ హీరో రాహుల్ ర‌వీంద్ర‌న్ “చి.ల‌.సౌ” సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారిన విష‌యం అందరికి తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవ్వకున్న కూడా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు మాత్రం అందుకుంది. రాహుల్ ర‌వీంద్ర‌న్ క‌థ‌లో చూపించిన కొత్త‌దనం నాగార్జున‌కు న‌చ్చి త‌న కోసం ఓ స్ర్కిప్ట్ రెడీ చేయ‌మ‌ని బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చాడు కూడా.

అయితే ఇటీవ‌ల నాగార్జున‌కు తను రాసుకున్న క‌థ చెప్పాడ‌ట‌ రవీంద్రన్. క‌థ విని నాగార్జున ఈ క‌థ నాకు సెట్ కాదు అని చెప్పేసాడ‌ట‌. అయితే ఈ క‌థ యంగ్ హీరోల‌కు బాగుంటుంది… నా ఏజ్ కి అస్సలు సెట్ అవ్వదు అని చెప్పాడట. కనీసం కథలో మార్పులు కూడా ఏమి చెప్పకుండా కథని పక్కన పెట్టేయ్యమని చెప్పాడట నాగార్జున. ఒకవేళ అంతగా ఆ కథ రాహుల్ కి నచ్చితే అఖిల్ కి చెప్పు అని రాహుల్ ని తెలివిగా సైడ్ చేసాడు నాగార్జున. మరి ఇప్పుడు రాహుల్ కొత్త కథతో వస్తాడా లేకపోతే ఉన్న కథనే అఖిల్ కు చెప్తాడో చూడాలి.

First Published:  5 Nov 2018 6:10 AM GMT
Next Story