Telugu Global
Cinema & Entertainment

నభా నటేష్ ని ఇంటికి పిలిచి అభినందించిన సీనియర్ డైరెక్టర్

తెలుగు ప్రేక్షకులకి ఒక హీరోయిన్ నచ్చితే ఆ హీరోయిన్ని కొంత కాలం వరకు అస్సలు వదిలిపెట్టారు. ఆ హీరోయిన్ తదుపరి సినిమాలు ఏంటో మరి తెలుసుకొని ఆ సినిమా కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఇటివలే అలా తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకున్న భామ నభా నటేష్. సుధీర్ బాబు హీరోగా వచ్చిన “నన్ను దోచుకుందువటే” సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. సినిమా అంతగా ఆకట్టుకోలేదు కానీ హీరోయిన్ మాత్రం అందరికి తెగ నచ్చేసింది. ఇటివలే […]

నభా నటేష్ ని ఇంటికి పిలిచి అభినందించిన సీనియర్ డైరెక్టర్
X

తెలుగు ప్రేక్షకులకి ఒక హీరోయిన్ నచ్చితే ఆ హీరోయిన్ని కొంత కాలం వరకు అస్సలు వదిలిపెట్టారు. ఆ హీరోయిన్ తదుపరి సినిమాలు ఏంటో మరి తెలుసుకొని ఆ సినిమా కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఇటివలే అలా తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకున్న భామ నభా నటేష్. సుధీర్ బాబు హీరోగా వచ్చిన “నన్ను దోచుకుందువటే” సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. సినిమా అంతగా ఆకట్టుకోలేదు కానీ హీరోయిన్ మాత్రం అందరికి తెగ నచ్చేసింది.

ఇటివలే మీడియా తో మాట్లాడిన ఈ భామ సీనియర్ దర్శకుడు రాఘవేంద్ర రావు “నన్ను దోచుకుందువటే” విడుదల తర్వాత యూనిట్ మొత్తాన్ని ఇంటికి పిలిచారని చెప్పింది. ఆ సంగతులు చెప్తూ ”నా గురించి అన్ని విషయాలూ అడిగి తెలుసుకున్నారు. ఇంత బాగా ఎలా నటించావు. మీ కుటుంబంలో ఎవరైనా నటీనటులు ఉన్నారా అని అడగగా, అలా ఏమీ లేదని. మా కుటుంబం నుంచి ఇండస్ట్రీకి వచ్చిన తొలి అమ్మాయిని నేనే” అని చెబితే మరింతగా అభినందించారు అని సంతోషంగా చెప్పింది. నాకు ప్రేక్షకుల నుంచి ప్రేమలేఖలేమీ రాలేదు. అలాంటివి వస్తాయేమో అని ఎదురు చూసా. కానీ “రాఘవేంద్రరావు గారి అభినందననే ఒక ప్రేమ లేఖగా అనుకుంటాను’’ అని చెప్పుకొచ్చింది నభా నటేష్.

First Published:  4 Nov 2018 10:27 PM GMT
Next Story