Telugu Global
NEWS

కిరణ్‌ వల్లే కాంగ్రెస్‌కు దూరమయ్యాం

ఒక్కటే మాట.. కాంగ్రెస్ కు ఎంఐఎంను దూరం చేసిందా.? బలమైన బంధంతో సాగిన ఎంఐఎం-కాంగ్రెస్ విడిపోవడానికి మాజీ కాంగ్రెస్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డినే కారణమా.? ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్ పై కత్తి కట్టి ఇప్పుడా పార్టీని ఓడించాలని చూడడానికి కిరణ్ చేసిన ఆ పనే కారణమా అంటే ఔను అనేలా సమాధానమిచ్చాడు అసదుద్దీన్. తాజాగా సంగారెడ్డిలో నిర్వహించిన ముస్లింల సభలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఎంతో […]

కిరణ్‌ వల్లే కాంగ్రెస్‌కు దూరమయ్యాం
X

ఒక్కటే మాట.. కాంగ్రెస్ కు ఎంఐఎంను దూరం చేసిందా.? బలమైన బంధంతో సాగిన ఎంఐఎం-కాంగ్రెస్ విడిపోవడానికి మాజీ కాంగ్రెస్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డినే కారణమా.? ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్ పై కత్తి కట్టి ఇప్పుడా పార్టీని ఓడించాలని చూడడానికి కిరణ్ చేసిన ఆ పనే కారణమా అంటే ఔను అనేలా సమాధానమిచ్చాడు అసదుద్దీన్.

తాజాగా సంగారెడ్డిలో నిర్వహించిన ముస్లింల సభలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఎంతో సన్నిహితంగా ఉండే కాంగ్రెస్-ఎంఐఎం బంధం బీటలు వారడానికి.. ఇప్పుడు టీఆర్ఎస్ తో చెలిమికి గల కారణాలను అసదుద్దీన్ వెల్లడించారు. ఈ సభలో ఆయన కాంగ్రెస్ ను ఓడించాలని…. అదే సమయంలో టీఆర్ఎస్ ను గెలిపించాలని ముస్లింలను కోరారు. అందుకు గల కారణాలను అసదుద్దీన్ వెల్లడించి సంచలనం రేపారు.

కేసీఆర్ ముస్లింల కోసం ఎంతో చేస్తున్నాడని అసదుద్దీన్ వివరించారు. షాదీ ముబారక్ తో పేద ముస్లింలకు లక్ష రూపాయలు ఇస్తున్నాడని తెలిపారు. పేద ముస్లిం పిల్లల కోసం వందకు పైగా మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేయించి…. అందులో 15వేల మంది పిల్లలకు చదువులు ఉచితంగా చెబుతున్నారని…. వారంతా పెరిగి పెద్ద వాళ్ళు అయ్యి దేశానికి ఉపయోగపడే పౌరులవుతారన్నారు. ఇంతే కాకుండా మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఏ ప్రభుత్వం ఇవ్వని స్థాయిలో కేసీఆర్ రుణాలు ఇప్పించారని అసదుద్దీన్ చెప్పుకొచ్చారు.

అదే సమయంలో గడిచిన 2014కు ముందు ముస్లిం నేతలను టార్గెట్ చేసి జైలుకు పంపిన కిరణ్ కుమార్ రెడ్డి వైఖరిని తూర్పారపట్టారు. కిరణ్ తనను, తన తమ్ముడు అకర్బుద్దీన్ పై దేశద్రోహం కేసులు పెట్టించి జైలు పాలు చేశాడని.. కాంగ్రెస్ వాళ్లు అప్పుడు సపోర్ట్ చేశారని.. అందుకే ముస్లింలపై దాడులు చేసిన కాంగ్రెస్ ను ఓడించాలని స్పష్టం చేశారు. ఇలా కాంగ్రెస్ పై తమ కోపానికి కిరణ్ కారణమని.. కాంగ్రెస్ కు అందుకే దూరంగా జరిగామని అసదుద్దీన్ అనడం రాజకీయంగా సంచలనంగా మారింది.

First Published:  5 Nov 2018 1:24 AM GMT
Next Story