Telugu Global
NEWS

బాలకృష్ణ లాగ నేను కూడా బూతులు మాట్లాడాలా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నందమూరి బాలకృష్ణ పై షాకింగ్ కామెంట్స్ చేసాడు. తెలుగుదేశం పార్టీ శ్రేణులను, బాలయ్య అభిమానులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసాడు పవన్ కళ్యాణ్ . ధర్మపోరాట దీక్ష అని చేస్తూ ఆ వేదిక మీద బాలయ్య దేశ ప్రధాని నరేంద్ర మోడీ ని తిట్టకూడని తిట్లు తిట్టిన విషయం అందరికి తెలిసిందే. అయితే అప్పట్లో బాలయ్య తిట్లు సోషల్ మీడియాలో వైరల్ కాగా భారతీయ జనతా పార్టీ నాయకులు , కార్యకర్తలు […]

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నందమూరి బాలకృష్ణ పై షాకింగ్ కామెంట్స్ చేసాడు. తెలుగుదేశం పార్టీ శ్రేణులను, బాలయ్య అభిమానులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసాడు పవన్ కళ్యాణ్ . ధర్మపోరాట దీక్ష అని చేస్తూ ఆ వేదిక మీద బాలయ్య దేశ ప్రధాని నరేంద్ర మోడీ ని తిట్టకూడని తిట్లు తిట్టిన విషయం అందరికి తెలిసిందే. అయితే అప్పట్లో బాలయ్య తిట్లు సోషల్ మీడియాలో వైరల్ కాగా భారతీయ జనతా పార్టీ నాయకులు , కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కూడా వ్యక్తం చేసారు.

అయితే పవన్ కళ్యాణ్ ఆ ఇన్సిడెంట్ ని గుర్తు చేస్తూ నేను కూడా మోడీ ని తిడితేనే స్పెషల్ స్టేటస్ కోసం పోరాడినట్లా, అంటే నేను బాలయ్య లాగ అందరిని బూతులు తిట్టాలా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. మరి పబ్లిక్ గా పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై బాలక్రిష్ణ ఎలా స్పందిస్తాడో చూడాలి.

First Published:  3 Nov 2018 11:20 PM GMT
Next Story