Telugu Global
Cinema & Entertainment

పూర్తి స్థాయి థ్రిల్లర్ గా "అమర్ అక్బర్ అంటోనీ" ?

శ్రీనువైట్ల కెరీర్ ఇక క్లోజ్ అయిపోతుంది అనే టైం లో మాస్ మహారాజ్ శ్రీనువైట్లకి అవకాశం ఇచ్చాడు. అదే “అమర్ అక్బర్ అంటోనీ” సినిమాగా రూపొందింది. అయితే శ్రీనువైట్ల ఈ సినిమాని కామెడీగా కంటే కూడా పూర్తీ స్థాయి థ్రిల్లర్ గా రూపొందించాడు అని తెలుస్తుంది. రెగ్యులర్ స్టైల్లో హీరో విలన్లను బకరాలను చేసే కాన్సెప్ట్ కు కాలం చెల్లిందని గ్రహించి ఈసారి థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులను షాక్ చేసేందుకు రెడీ అయ్యాడట. ఇటివలే రిలీజ్ […]

పూర్తి స్థాయి థ్రిల్లర్ గా అమర్ అక్బర్ అంటోనీ ?
X

శ్రీనువైట్ల కెరీర్ ఇక క్లోజ్ అయిపోతుంది అనే టైం లో మాస్ మహారాజ్ శ్రీనువైట్లకి అవకాశం ఇచ్చాడు. అదే “అమర్ అక్బర్ అంటోనీ” సినిమాగా రూపొందింది. అయితే శ్రీనువైట్ల ఈ సినిమాని కామెడీగా కంటే కూడా పూర్తీ స్థాయి థ్రిల్లర్ గా రూపొందించాడు అని తెలుస్తుంది. రెగ్యులర్ స్టైల్లో హీరో విలన్లను బకరాలను చేసే కాన్సెప్ట్ కు కాలం చెల్లిందని గ్రహించి ఈసారి థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులను షాక్ చేసేందుకు రెడీ అయ్యాడట.

ఇటివలే రిలీజ్ అయిన ఈ టిజర్ చూసి కూడా అందరు ఇది పక్కా థ్రిల్లర్ సినిమాగా రూపొందుతుంది అని అంటున్నారు. కానీ ట్రైలర్ లో మాత్రం కొన్ని కామెడీ షాట్స్ ని పెట్టాలి అని డిసైడ్ అయ్యాడ శ్రీనువైట్ల. ఈ ట్రైలర్ లో సునీల్ ని కూడా పెట్టనున్నాడు శ్రీనువైట్ల. మరి రవితేజ లాంటి మాస్ హీరోతో తనకి అలవాటు అయిన కామెడీ ని పక్కన పెట్టి శ్రీనువైట్ల ఎలాంటి కథని చెప్పబోతున్నాడు అనేది తెలియాలి అంటే నవంబర్ 16 వరకు ఆగాల్సిందే.

First Published:  4 Nov 2018 1:31 AM GMT
Next Story