Telugu Global
International

అక్బర్‌ నన్ను రేప్‌ చేశాడు " పల్లవి గొగోయ్

కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ ఎడిటర్ ఎంజే అక్బర్‌పై వరుసగా లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే 16మంది మహిళా పాత్రికేయులు అక్బర్‌ చేసిన పనులను మీ టూ ఉద్యమంలో భాగంగా బయటపెట్టారు. దీంతో ఇటీవలే ఆయన కేంద్ర మంత్రి పదవికూడా పోగొట్టుకున్నారు. ఇప్పుడు అమెరికాలోని ప్రముఖ మీడియా సంస్థ నేషనల్ పబ్లిక్ రేడియో చీఫ్ బిజినెస్ ఎడిటర్ పల్లవి గొగోయ్ సంచలన విషయాలు చెప్పారు. 23 ఏళ్ల క్రితం ఎంజే అక్బర్‌ తనను రేప్‌ చేశారని […]

అక్బర్‌ నన్ను రేప్‌ చేశాడు  పల్లవి గొగోయ్
X

కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ ఎడిటర్ ఎంజే అక్బర్‌పై వరుసగా లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే 16మంది మహిళా పాత్రికేయులు అక్బర్‌ చేసిన పనులను మీ టూ ఉద్యమంలో భాగంగా బయటపెట్టారు. దీంతో ఇటీవలే ఆయన కేంద్ర మంత్రి పదవికూడా పోగొట్టుకున్నారు. ఇప్పుడు అమెరికాలోని ప్రముఖ మీడియా సంస్థ నేషనల్ పబ్లిక్ రేడియో చీఫ్ బిజినెస్ ఎడిటర్ పల్లవి గొగోయ్ సంచలన విషయాలు చెప్పారు. 23 ఏళ్ల క్రితం ఎంజే అక్బర్‌ తనను రేప్‌ చేశారని ఆమె వెల్లడించారు. ఈమేరకు వాషింగ్టన్‌ పోస్ట్‌లో ఆమె వ్యాసం రాశారు.

ఢిల్లీలో ఏషియన్ ఏజ్ సంస్థ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌గా అక్బర్ పనిచేస్తున్న సమయంలో తనపై లైంగిక దాడి చేశాడని ఆమె వివరించారు. 1994లో ఒక రోజు తాను ఒపీనియన్ ఎడిటోరియల్ పేజ్‌కు రాసిన వ్యాసానికి పెట్టిన హెడ్‌లైన్‌ను చూపించేందుకు అక్బర్‌ దగ్గరకు వెళ్లానని.. ఆ హెడ్‌లైన్‌ను మెచ్చుకుంటూ హఠాత్తుగా ముద్దు పెట్టుకున్నారని చెప్పారు. అక్బర్‌ దగ్గర పనిచేయడం అద్బుతంగా అనిపించేదని… ఆయన మాటలు మైమరిపించేవని.. కానీ తాను అనుకున్న ఉద్యోగంలో కొనసాగే క్రమంలో చాలా కోల్పోయానని ఆవేదన చెందారామె.

ఓ మేగజైన్ ప్రారంభోత్సవానికి ముంబై వెళ్లినప్పుడు హోటల్‌ గదిలోనూ మరోసారి లైంగిక దాడికి అక్బర్ ప్రయత్నించాడని ఆమె వివరించారు. మరోసారి జైపూర్‌లో అసైన్‌మెంట్‌ ఉందని తీసుకెళ్లాడని.. ఆ సమయంలో మాత్రం తాను అక్బర్ బారి నుంచి తప్పించుకోలేకపోయానని వివరించారు.

హోటల్ గదిలోకి పిలిచి అత్యాచారం చేశాడని… ఎంతగా ప్రతిఘటించినా అతడి బలం ముందు నిలువలేకపోయానన్నారు. బట్టలు చించి తనను రేప్‌ చేశాడని చెప్పారామె. కానీ అవమానభారంతో పోలీసులకు కూడా అప్పట్లో తాను ఫిర్యాదు చేయలేకపోయానని వెల్లడించారు.

అత్యాచారం చేసిన తర్వాత అక్బర్‌ తనపై మరింత పెత్తనం చెలాయించేవాడని చెప్పారు. తోటి పురుష ఉద్యోగులతో మాట్లాడినా అక్బర్‌ జీర్ణించుకునే వాడు కాదని తాజా వ్యాసంలో వివరించారు. ఆ సమయంలో నన్నునేను అసహ్యించుకుంటూ కుమిలిపోయానని… బహుశా ఉద్యోగం పోతుందన్న భయం వల్ల తాను ఎదురుతిరగలేకపోయి ఉండవచ్చని ఆమె వివరించారు.

పల్లవి గొగోయ్ ఆరోపణలపై అక్బర్‌తో పాటు ఆయన భార్య కూడా స్పందించారు. అప్పట్లో ఆమెతో లైంగిక సంబంధం పరస్పర అంగీకారంతోనే కొన్ని నెలల పాటు కొనసాగిందని అక్బర్‌ చెప్పారు. ఆ బంధం వల్ల ఇంట్లో కలతలు రావడంతో ఆ బంధానికి ముగింపు పలికామని వెల్లడించారు. అక్బర్‌ భార్య మల్లిక కూడా పల్లవి ఆరోపణలను ఖండించారు. ఇరవయ్యేళ్ల క్రితం పల్లవి గొగోయ్‌ మా కుటుంబంలో అపనమ్మకానికి, అసంతృప్తులకు కారణమయ్యారని మండిపడ్డారు. అప్పట్లో ఆమె తన భర్తతో నెరిపిన సంబంధం గురించి తనకూ తెలుసని… తన కళ్లముందే అక్బర్‌, ఆమె సన్నిహితంగా మెలిగేవారని చెప్పారు. ఇంత కాలం తర్వాత ఆమె ఎందుకు ఇలాంటి అబద్దాలు చెబుతున్నారో అర్థం కావడం లేదన్నారు.

First Published:  2 Nov 2018 11:02 PM GMT
Next Story