Telugu Global
Cinema & Entertainment

మరో క్రేజీ ప్రాజెక్టులో కైరా అద్వానీ?

ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం కైరా మేనియా నడుస్తున్నట్టుంది. ఒక్క సినిమా అనుభవంతో ఈ ముద్దుగుమ్మకు వరుసపెట్టి ఆఫర్లు వస్తున్నాయి. భరత్ అనే నేను సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన కైరా, ప్రస్తుతం రామ్ చరణ్, బోయపాటి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ సెట్స్ పై ఉంటుండగానే ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టు కైరాను వరించనుంది. అదే మహేష్-సుకుమార్ సినిమా. మహేష్ కోసం సుకుమార్ ఓ స్టోరీ రెడీ చేశాడు. మహర్షి కంప్లీట్ అయిన వెంటనే మహేష్ […]

మరో క్రేజీ ప్రాజెక్టులో కైరా అద్వానీ?
X

ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం కైరా మేనియా నడుస్తున్నట్టుంది. ఒక్క సినిమా అనుభవంతో ఈ ముద్దుగుమ్మకు వరుసపెట్టి ఆఫర్లు వస్తున్నాయి. భరత్ అనే నేను సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన కైరా, ప్రస్తుతం రామ్ చరణ్, బోయపాటి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ సెట్స్ పై ఉంటుండగానే ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టు కైరాను వరించనుంది. అదే మహేష్-సుకుమార్ సినిమా.

మహేష్ కోసం సుకుమార్ ఓ స్టోరీ రెడీ చేశాడు. మహర్షి కంప్లీట్ అయిన వెంటనే మహేష్ స్టార్ట్ చేయబోయేది ఈ సినిమానే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వచ్చే ఏడాది నుంచి ఇది సెట్స్ పైకి వస్తుంది. ఈ సినిమాలో కైరాను హీరోయిన్ గా తీసుకోబోతున్నారు. అలా కైరాకు మరోసారి ఛాన్స్ ఇస్తున్నాడు మహేష్ బాబు.

బన్నీ-త్రివిక్రమ్ సినిమా కోసం ఇప్పటికే కైరాను సంప్రదించినట్టు వార్తలొచ్చాయి. వాటితో పాటు మహేష్ సినిమా కూడా ఓకే అయితే, కైరా ఇక టాలీవుడ్ లో పాతుకుపోయినట్టే. మరోవైపు ఆమెకు బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. మరి ఆమె తెలుగు సినిమాలకు ప్రాధాన్యం ఇస్తుందా, బాలీవుడ్ వైపు మరోసారి మొగ్గుచూపుతుందా అనేది వేచిచూడాలి.

First Published:  2 Nov 2018 11:56 PM GMT
Next Story