Telugu Global
NEWS

వాళ్ళు ఆంధ్రా ద్రోహులైతే.... నువ్వు?

ఏమాత్రం టీడీపీ నేతలకు, కార్యకర్తలకు ఆత్మగౌరవం ఉన్నా వెంటనే టీడీపీ నుంచి బయటకు రావాలని పిలుపునిచ్చారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. టీడీపీ ఆత్మగౌరవాన్ని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని బజారులో తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని కన్నా మండిపడ్డారు. ఇలాంటి రాజకీయ వ్యభిచారితో కలిసి ఉంటారో ఆత్మగౌరవంతో బయటకు వస్తారో తెలుగు తమ్ముళ్లు తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి అతడిని హత్య చేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. సోనియా ఇటలీ దయ్యం అని, […]

వాళ్ళు ఆంధ్రా ద్రోహులైతే.... నువ్వు?
X

ఏమాత్రం టీడీపీ నేతలకు, కార్యకర్తలకు ఆత్మగౌరవం ఉన్నా వెంటనే టీడీపీ నుంచి బయటకు రావాలని పిలుపునిచ్చారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. టీడీపీ ఆత్మగౌరవాన్ని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని బజారులో తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని కన్నా మండిపడ్డారు. ఇలాంటి రాజకీయ వ్యభిచారితో కలిసి ఉంటారో ఆత్మగౌరవంతో బయటకు వస్తారో తెలుగు తమ్ముళ్లు తేల్చుకోవాలని పిలుపునిచ్చారు.

ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి అతడిని హత్య చేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. సోనియా ఇటలీ దయ్యం అని, సోనియాకు డబ్బు పిచ్చి పట్టిందని, కాంగ్రెస్‌ పార్టీ రక్తంతో తడిసిన హస్తం అని అన్నది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. దేశంలో చంద్రబాబు చక్రం తిప్పుతున్నారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు హయాంలో అవకాశవాద రాజకీయాలు పెరిగిపోయాయన్నారు.

చంద్రబాబు మానసిక వ్యాధితో బాధపడుతున్నారని మరోసారి కన్నా చెప్పారు. చంద్రబాబు రాజకీయాలు చూసి ఊసరవెల్లులే సిగ్గుపడుతున్నాయన్నారు. చంద్రబాబు ఎప్పుడు ఎవరిని పొగుడుతారో అర్థం కావడం లేదన్నారు. వ్యక్తిగత స్వార్థం కోసం చంద్రబాబు ఏస్థాయికైనా దిగజారుతారని మరోసారి తేలిపోయిందన్నారు.

గతంలో చంద్రబాబు, నారా లోకేష్‌ ఇద్దరూ కాంగ్రెస్‌ను, సోనియాగాంధీని, రాహుల్‌ గాంధీని తిట్టిపోసిన ప్రసంగాలను మీడియా సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ ప్రదర్శించారు. రాష్ట్రంలోనూ అవినీతి అధికారులపై ఏసీబీ దాడులు జరుగుతున్నాయని అవి కూడా కక్ష సాధింపు చర్యలే అంటే చంద్రబాబు ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు.

ఏపీలో వ్యాపారులపై జరుగుతున్నవి కేవలం ఐటీ దాడులు మాత్రమేనన్నారు. వ్యాపారాలతో సంబంధం లేని ఏ ఒక్క టీడీపీ నేత ఇంటిపైనైనా ఐటీ దాడులు జరిగాయా అని ప్రశ్నించారు. పన్నులు ఎగ్గొట్టిన వ్యాపారులపై ఐటీ దాడులు జరిగితే అవి టీడీపీపై కక్ష సాధింపు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇలాంటి చంద్రబాబుకు మీడియా కూడా వంతపాడితే ఈ రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలన్నారు కన్నా లక్ష్మీనారాయణ. అవినీతి అనకొండ చంద్రబాబును ఎల్లో మీడియా వెనుకేసుకొస్తోందన్నారు.

రాహుల్‌ గాంధీని కలిసిన వారు ఆంధ్రా ద్రోహులని మొన్నటి వరకు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు రాహుల్‌ను కలవడాన్ని ఏమనాలని నిలదీశారు.

First Published:  3 Nov 2018 12:22 AM GMT
Next Story