Telugu Global
NEWS

కాంగ్రెస్‌కు సీ. రామచంద్రయ్య రాజీనామా !

చంద్రబాబుతో కాంగ్రెస్‌ పొత్తును ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. నేతలు ఒక్కొక్కరు రాజీనామాలకు సిద్దపడుతున్నారు. రాహుల్‌ గాంధీతో చంద్రబాబు భేటీ అయిన వెంటనే కాంగ్రెస్ సీనియర్ నేత వట్టి వసంతకుమార్ రెండు రోజుల క్రితమే కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. నిజానికి ఆయన కాంగ్రెస్‌ గెలిచినా, ఓడినా ఆఖరి వరకు కాంగ్రెస్‌లోనే ఉంటానని చెప్పేవారు. కానీ చంద్రబాబుతో చేయి కలపడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని అందుకే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వట్టి బాటలోనే ఇప్పుడు సీనియర్ నేత సి. రామచంద్రయ్య ప్రయాణిస్తున్నారు. […]

కాంగ్రెస్‌కు సీ. రామచంద్రయ్య రాజీనామా !
X

చంద్రబాబుతో కాంగ్రెస్‌ పొత్తును ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. నేతలు ఒక్కొక్కరు రాజీనామాలకు సిద్దపడుతున్నారు. రాహుల్‌ గాంధీతో చంద్రబాబు భేటీ అయిన వెంటనే కాంగ్రెస్ సీనియర్ నేత వట్టి వసంతకుమార్ రెండు రోజుల క్రితమే కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.

నిజానికి ఆయన కాంగ్రెస్‌ గెలిచినా, ఓడినా ఆఖరి వరకు కాంగ్రెస్‌లోనే ఉంటానని చెప్పేవారు. కానీ చంద్రబాబుతో చేయి కలపడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని అందుకే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వట్టి బాటలోనే ఇప్పుడు సీనియర్ నేత సి. రామచంద్రయ్య ప్రయాణిస్తున్నారు. ఆయన కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.

నిన్నటి వరకు లక్షల కోట్లు దోపిడి చేశారని చంద్రబాబుపై విరుకుపడిన తాము ఇప్పుడు అదే చంద్రబాబు కింద ఎలా పనిచేయాలన్నది సి. రామచంద్రయ్య అభ్యంతరం. ఇది సిద్ధాంతాలను వదిలేసి, విలువలు లేని రాజకీయం చేయడమేనని సి. రామచంద్రయ్య మండిపడుతున్నారు. అందుకే ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.

23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబు కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. ఏపీలో తన ఇమేజ్ దెబ్బతిన్న ప్రతిసారి చంద్రబాబు ఢిల్లీ వెళ్తారని… అక్కడి నేతలకు శాలువాలు కప్పి లడ్డులు ఇస్తాడని మండిపడ్డారు. శాలువాలు కప్పి లడ్డూలు ఇవ్వగానే లొంగిపోతారా అని ఢిల్లీ పెద్దలను ప్రశ్నించారు. కాంగ్రెస్‌, టీడీపీ పొత్తును నిరసిస్తూ కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్టు రామచంద్రయ్య ప్రకటించారు.

First Published:  3 Nov 2018 1:30 AM GMT
Next Story