Telugu Global
Cinema & Entertainment

సవ్యసాచి ప్రీ-రిలీజ్ బిజినెస్

నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా నటించిన సవ్యసాచి సినిమా వరల్డ్ వైడ్ 23 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. నాగచైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాను మినిమం లాభాలకు అమ్మారు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు. నైజాంతో పాటు ఓవర్సీస్, వెస్ట్ ఏరియాల్లో తమకు తెలిసిన దగ్గర వ్యక్తులకే హక్కులు కట్టబెట్టారు. సినిమా హిట్ అయితే నైజాం మినహా, దాదాపు అన్ని ఏరియాల్లో మొదటి వారానికే బ్రేక్-ఈవెన్ వచ్చేలా ప్రీ-రిలీజ్ బిజినెస్ చేశారు. […]

సవ్యసాచి ప్రీ-రిలీజ్ బిజినెస్
X
నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా నటించిన సవ్యసాచి సినిమా వరల్డ్ వైడ్ 23 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. నాగచైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాను మినిమం లాభాలకు అమ్మారు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు. నైజాంతో పాటు ఓవర్సీస్, వెస్ట్ ఏరియాల్లో తమకు తెలిసిన దగ్గర వ్యక్తులకే హక్కులు కట్టబెట్టారు.
సినిమా హిట్ అయితే నైజాం మినహా, దాదాపు అన్ని ఏరియాల్లో మొదటి వారానికే బ్రేక్-ఈవెన్ వచ్చేలా ప్రీ-రిలీజ్ బిజినెస్ చేశారు. దాదాపు 15 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రీ-రిలీజ్ బిజినెస్ ఈ కింద విధంగా ఉంది.
నైజాం – రూ. 6 కోట్లు
ఉత్తరాంద్ర – రూ. 2.25 కోట్లు
సీడెడ్ – రూ. 3.20 కోట్లు
ఈస్ట్ – రూ. 1.40 కోట్లు
వెస్ట్ – రూ. 1.12 కోట్లు
గుంటూరు – రూ. 1.62 కోట్లు
కృష్ణా – రూ. 1.28 కోట్లు
నెల్లూరు – రూ. 72 లక్షలు
First Published:  1 Nov 2018 4:47 PM GMT
Next Story