Telugu Global
Cinema & Entertainment

మేజిక్ డేట్ సెట్ చేసిన రాజమౌళి

రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్.. టాలీవుడ్ లో ఎక్కువమంది మాట్లాడుకునే ప్రాజెక్టు ఇది. రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమాకు ముహూర్తం సెట్ చేశాడు రాజమౌళి. ఈనెల 11న సరిగ్గా ఉదయం 11 గంటలకు చెర్రీ-తారక్ మల్టీస్టారర్ ప్రారంభం అవుతుందని ప్రకటించాడు జక్కన్న. ఈ మేరకు డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ యూట్యూబ్ ఛానెల్ ఓ వీడియోను విడుదల చేశాడు. 11-11-11 అనే […]

మేజిక్ డేట్ సెట్ చేసిన రాజమౌళి
X

రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్.. టాలీవుడ్ లో ఎక్కువమంది మాట్లాడుకునే ప్రాజెక్టు ఇది. రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమాకు ముహూర్తం సెట్ చేశాడు రాజమౌళి. ఈనెల 11న సరిగ్గా ఉదయం 11 గంటలకు చెర్రీ-తారక్ మల్టీస్టారర్ ప్రారంభం అవుతుందని ప్రకటించాడు జక్కన్న.

ఈ మేరకు డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ యూట్యూబ్ ఛానెల్ ఓ వీడియోను విడుదల చేశాడు. 11-11-11 అనే అంకెలతో ఆ వీడియో స్టార్ట్ అవుతుంది. అంటే.. 11వ నెల 11వ తేదీ 11గంటలకు అని అర్థం. ఆ తర్వాత ఆ 11 అనే అంకెలు… RRR అనే అక్షరాలుగా మారతాయి. ఈ ప్రాజెక్టును #RRR (రామ్ చరణ్, రామారావు, రాజమౌళి)గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు లాంఛింగ్ రోజు తెలిసే అవకాశం ఉంది. ఈ ప్రారంభోత్సవాన్ని కనీవినీ ఎరుగని రీతిలో ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ కు చెందిన స్టార్ హీరోలతో పాటు బాలీవుడ్ స్టార్స్ ను కూడా అహ్వానిస్తున్నారు. అదే రోజు సినిమా కథకు సంబంధించి వివరాలు కూడా వెల్లడయ్యే అవకాశముంది.

First Published:  2 Nov 2018 9:53 AM GMT
Next Story