Telugu Global
Cinema & Entertainment

మహేష్ బాబుని త్రివిక్రమ్ బాగా ఇబ్బంది పెట్టాడా?

“ఆకు తింటావా ఆకు” అనే ఒక డైలాగు “అరవింద సమేత” చిత్రంలో బాగా పేలింది.సోషల్ మీడియాలో కూడా ఈ డైలాగు ని సందర్భానుసారంగా వాడేస్తున్నారు నెటిజన్లు అయితే ఆ డైలాగు చెప్పిన నటుడి పేరు మానిక్ రెడ్డి. అంతకు ముందు పలు చిత్రాల్లో నటించాడు మానిక్ రెడ్డి. అయితే ఏ సినిమా తోను అంతగా గుర్తింపు రాలేదు. ఇప్పుడు “అరవింద సమేత”లో చేసింది చిన్న పాత్ర అయినా కొంచెం జనాలు గుర్తిస్తున్నారు. త్రివిక్రమ్ కు ఆప్త మిత్రుడు […]

మహేష్ బాబుని త్రివిక్రమ్ బాగా ఇబ్బంది పెట్టాడా?
X

“ఆకు తింటావా ఆకు” అనే ఒక డైలాగు “అరవింద సమేత” చిత్రంలో బాగా పేలింది.సోషల్ మీడియాలో కూడా ఈ డైలాగు ని సందర్భానుసారంగా వాడేస్తున్నారు నెటిజన్లు

అయితే ఆ డైలాగు చెప్పిన నటుడి పేరు మానిక్ రెడ్డి. అంతకు ముందు పలు చిత్రాల్లో నటించాడు మానిక్ రెడ్డి. అయితే ఏ సినిమా తోను అంతగా గుర్తింపు రాలేదు. ఇప్పుడు “అరవింద సమేత”లో చేసింది చిన్న పాత్ర అయినా కొంచెం జనాలు గుర్తిస్తున్నారు.

త్రివిక్రమ్ కు ఆప్త మిత్రుడు అయిన మానిక్ రెడ్డి తాజాగా త్రివిక్రమ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను బయట పెట్టాడు. అతను మాట్లాడుతూ అతడు సినిమా షూటింగ్ గురించి చెప్పాడు. త్రివిక్రమ్ మహేష్ ని ఇబ్బంది పెట్టిన రోజులని గుర్తు చేసుకున్నాడు. అతడు సినిమా షూటింగ్ కొంతమేర పాత బస్తి లో చిత్రీకరణ చేశారట.. అక్కడ రిస్క్ అయినా సహజత్వం కోసం అక్కడే చేయించాడట త్రివిక్రమ్. షూటింగ్ వాతావరణం లేకుండా జాగ్రత్తగా షూటింగ్ చేసారట. కెమెరాలు కనపడకుండా.. చిత్రీకరణ అంతా పూర్తి అయిన తర్వాత హమ్మయ్య అంటూ అంతా ఊపిరి పీల్చుకున్నాం అంటూ మానిక్ రెడ్డి అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మొత్తానికి కెరీర్ స్టార్టింగ్ లోనే మహేష్ బాబుని ఇబ్బంది పెట్టేసాడు త్రివిక్రం.

First Published:  1 Nov 2018 9:35 PM GMT
Next Story