Telugu Global
NEWS

బాబు గతంలో అన్నమాటలే ప్రత్యర్థులకు ఆయుధాలు!

చంద్రబాబు నాయుడుకు మాట మీద నిలబడే తత్వం కించిత్ కూడా ఉండదు. బాబు పరమ అవకాశవాది. ఎప్పటికప్పుడు మాట మార్చేస్తూ ఉంటాడు. తన అవకాశవాదం కొద్దీ మాట్లాడుతూ ఉంటాడు. అది రాష్ట్ర ప్రయోజనాల విషయం అయినా, తన రాజకీయం విషయంలో అయినా చంద్రబాబు నాయుడు అదే తీరున వ్యవహరిస్తూ ఉంటాడు. ఏపీకి ప్రాణప్రదం అయిన ప్రత్యేకహోదా విషయంలోనే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడో.. అందరికీ తెలిసిందే. తన అవసరానికి తగ్గట్టుగా ప్రత్యేకహోదా అవసరం లేదని ఒకసారి.. కాదు.. […]

బాబు గతంలో అన్నమాటలే ప్రత్యర్థులకు ఆయుధాలు!
X

చంద్రబాబు నాయుడుకు మాట మీద నిలబడే తత్వం కించిత్ కూడా ఉండదు. బాబు పరమ అవకాశవాది. ఎప్పటికప్పుడు మాట మార్చేస్తూ ఉంటాడు. తన అవకాశవాదం కొద్దీ మాట్లాడుతూ ఉంటాడు.

అది రాష్ట్ర ప్రయోజనాల విషయం అయినా, తన రాజకీయం విషయంలో అయినా చంద్రబాబు నాయుడు అదే తీరున వ్యవహరిస్తూ ఉంటాడు. ఏపీకి ప్రాణప్రదం అయిన ప్రత్యేకహోదా విషయంలోనే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడో.. అందరికీ తెలిసిందే.

తన అవసరానికి తగ్గట్టుగా ప్రత్యేకహోదా అవసరం లేదని ఒకసారి.. కాదు.. కాదు.. ప్రత్యేకహోదా కావాలని మరోసారి చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తూ వచ్చాడు.

బీజేపీతో కలిసి ఉన్నంత సేపూ బాబుకు ప్రత్యేకహోదా పట్టలేదు. ఎప్పుడైతే కమలం పార్టీతో బంధాన్ని తెంచుకున్నాడో అప్పటి నుంచి హోదా విషయంలో అన్యాయం జరిగిందని అంటూ వచ్చాడు. హోదా తో ఏమీ రాదన్న నోటితోనే.. హోదా ఇవ్వకుండా బీజేపీ అన్యాయం చేసిందని వాపోతున్నాడు.

ఇలా మాటలు మార్చేయడమే చంద్రబాబుకు తెలిసిన రాజకీయం. ఇక ఇప్పుడు బాబు అవకాశవాద అధ్యాయంలో మరో చాప్టర్ కాంగ్రెస్ తో జత కట్టడం.

ఇక ఇప్పుడు కూడా బాబు గతంలో అన్న మాటలు గుర్తు రాకమానవు. కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు నాయుడు మూడు దశాబ్దాల నుంచి తిడుతూనే ఉన్నాడను కోండి. ప్రత్యేకించి గత ఐదేళ్లలో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. సోనియాగాంధీ రాష్ట్రాన్ని విభజించిందని, సీమాంధ్రకు అన్యాయం చేసిందని… రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని.. ఇలా చంద్రబాబు నాయుడు చెబుతూ వచ్చాడు.

అంతటితో కూడా ఆగలేదు. అవినీతి పార్టీలు కాంగ్రెస్ పార్టీతో జత కడతాయని కూడా బాబు చెప్పుకొచ్చాడు. వైసీపీ, తెరాసలు కాంగ్రెస్ తో జత కడతాయని కూడా అన్నాడు. చివరకు ఇప్పుడు తనే కాంగ్రెస్ తో కలిసిపోతున్నాడు. ఇదీ చంద్రబాబు తీరు. సోనియాను దెయ్యం అని.. పాపిష్టిది అని.. సీమాంధ్రకు ద్రోహం చేసిందని అని.. ఇప్పుడు ఆమెతోనే చేతులు కలిపాడు. ఈ తీరు ప్రత్యర్థులకు ఆయుధం కాదా?

First Published:  2 Nov 2018 4:00 AM GMT
Next Story