Telugu Global
Cinema & Entertainment

"ఆర్.ఆర్.ఆర్" సినిమా కోసం గండిపేట్ లో భారీ సెట్

ఎస్.ఎస్ రాజమౌళి “బాహుబలి” తరువాత రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంభందించిన ఒక సెట్ వర్క్ గండిపేట్ లో జరుగుతుందట. అక్కడ బ్రిటిష్ కాలం నాటి ఒక పట్టణ ప్రాంతం తో పాటుగా ఒక గ్రామానికి సంబంధించిన కూడలి ఈ సెట్ లో భాగంగా నిర్మాణం చేస్తున్నారట. దీంతో #RRR కథ […]

ఆర్.ఆర్.ఆర్ సినిమా కోసం గండిపేట్ లో భారీ సెట్
X

ఎస్.ఎస్ రాజమౌళి “బాహుబలి” తరువాత రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంభందించిన ఒక సెట్ వర్క్ గండిపేట్ లో జరుగుతుందట. అక్కడ బ్రిటిష్ కాలం నాటి ఒక పట్టణ ప్రాంతం తో పాటుగా ఒక గ్రామానికి సంబంధించిన కూడలి ఈ సెట్ లో భాగంగా నిర్మాణం చేస్తున్నారట. దీంతో #RRR కథ స్వాతంత్ర్య పోరాటం జరిగిన కాలం నేపథ్యంలో ఉంటుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఈ సెట్ లోనే మొదటి షెడ్యూల్ స్టార్ట్ చేసి ఫినిష్ చేసే దిశగా రాజమౌళి ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది.

చరణ్ ఎన్టీఆర్ లలో ఒకరు దొంగగా మరొకరు పోలీసు అధికారిగా కనిపిస్తారట. ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్ ఫిలిం అంటే దేశవ్యాప్తంగా అందరికీ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఈ సినిమాతో కూడా దేశవ్యాప్తంగా మంచి బజ్ క్రియేట్ చేసుకున్నాడు రాజమౌళి. డి.వి.వి ఎంటర్టైన్మెంట్స్ పై దానయ్య ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఎం.ఎం కీరవాణి ఈ సినిమాని సంగీతాన్ని అందిస్తున్నాడు.

First Published:  1 Nov 2018 8:22 PM GMT
Next Story