Telugu Global
International

ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా భోజనంపై బీసీసీఐ కఠిన నిర్ణయం...

టీం ఇండియా జట్టుకు పెద్ద టెన్షన్ వచ్చి పడింది. విదేశీ టూర్లకు వెళ్లినప్పుడు అక్కడి వంటకాలతో బేజారెత్తిపోతున్నారట. ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ ఆడే సమయంలో పడిన ఇబ్బంది ఆస్ట్రేలియా టూర్ లో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. రెండు నెలల పర్యటనకు గాను టీం ఇండియా జట్టు సభ్యులు ఆస్ట్రేలియా వెళ్లనున్నారు. అక్కడ భోజనంలో ఖచ్చితంగా బీఫ్ తొలగింపును కోరుతున్నారట. ఇటీవల ఇంగ్లాండ్ లో భోజనం సందర్భంగా గోడ్డు మాంసంతో చేసిన పాస్తాను ఉంచారట. జట్టులో చాలా మంది […]

ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా భోజనంపై బీసీసీఐ కఠిన నిర్ణయం...
X

టీం ఇండియా జట్టుకు పెద్ద టెన్షన్ వచ్చి పడింది. విదేశీ టూర్లకు వెళ్లినప్పుడు అక్కడి వంటకాలతో బేజారెత్తిపోతున్నారట. ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ ఆడే సమయంలో పడిన ఇబ్బంది ఆస్ట్రేలియా టూర్ లో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

రెండు నెలల పర్యటనకు గాను టీం ఇండియా జట్టు సభ్యులు ఆస్ట్రేలియా వెళ్లనున్నారు. అక్కడ భోజనంలో ఖచ్చితంగా బీఫ్ తొలగింపును కోరుతున్నారట. ఇటీవల ఇంగ్లాండ్ లో భోజనం సందర్భంగా గోడ్డు మాంసంతో చేసిన పాస్తాను ఉంచారట. జట్టులో చాలా మంది శాఖాహారులు ఉన్నారు. దీంతో వారు ఆ పాస్తాను పక్కన పెట్టుకొని తినేందుకు ఇబ్బందిపడ్డారట.

ఆస్ట్రేలియా టూర్లో మంసాహారం జోలికి వెళ్లకుండా బీసీసీఐ జాగ్రత్త పడింది. అక్కడ భారతీయ హోటల్ తో భోజనం సరఫరాకు ఒప్పందం చేసుకుంది. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎప్పుడో మాంసానికి దూరమయ్యాడు. ఇతని మెనూ ప్రత్యేకంగా ఉంటుంది. కనీసం పాలు, గుడ్లు కూడా తీసుకోవడం మానేశాడు.

ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టిన అతను శాకాహారిగా మారిపోయాడు. ప్రస్తుతం అతని ఫిట్ నెస్ లోనూ చాలా మార్పు కనబడుతుంది. పరుగులు సాధించడంలోనూ ముందున్నాడు. ఈ క్రమంలో జట్టు సభ్యుల భోజనం పూర్తిగా భారతీయ సంప్రదాయ ప్రకారం ఉండేలా బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

విరాట్ కొహ్లీ పట్టుబట్టినట్టుగా విదేశీ టూర్లలోనూ అరటిపండ్లు అందుబాటులో ఉంచేందుకు బీసీసీఐ అంగీకరించింది.

First Published:  2 Nov 2018 4:35 AM GMT
Next Story