Telugu Global
NEWS

టీటీడీ చైర్మన్‌ అయి తీరుతా " శివాజీ

ఆపరేషన్‌ గరుడ ఫ్రేం శివాజీ పెద్ద పదవులకే స్కెచ్ వేస్తున్నారు. ఆపరేషన్ గరుడ పేరుతో కేంద్రంపై నిందలేస్తూ చంద్రబాబు ప్రభుత్వానికి పరోక్షంగా మద్దతు తెలుపుతూ శివాజీ వస్తున్నారు. ప్రతిపక్షనేతపై హత్యకు కుట్ర జరుగుతోందని, అదంతా ఆపరేషన్ గరుడలో భాగమేనంటూ చెబుతూ వచ్చారు. అనుకున్నట్టుగానే జగన్‌పై దాడి జరిగింది. కానీ ఆయన అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డారు. దాంతో శివాజీని అరెస్ట్ చేసి విచారించి ఆపరేషన్ గరుడ నిజాలను రాబట్టాలన్న డిమాండ్ పెరుగుతోంది. కానీ జగన్‌పై దాడి సమయానికి […]

టీటీడీ చైర్మన్‌ అయి తీరుతా  శివాజీ
X

ఆపరేషన్‌ గరుడ ఫ్రేం శివాజీ పెద్ద పదవులకే స్కెచ్ వేస్తున్నారు. ఆపరేషన్ గరుడ పేరుతో కేంద్రంపై నిందలేస్తూ చంద్రబాబు ప్రభుత్వానికి పరోక్షంగా మద్దతు తెలుపుతూ శివాజీ వస్తున్నారు. ప్రతిపక్షనేతపై హత్యకు కుట్ర జరుగుతోందని, అదంతా ఆపరేషన్ గరుడలో భాగమేనంటూ చెబుతూ వచ్చారు.

అనుకున్నట్టుగానే జగన్‌పై దాడి జరిగింది. కానీ ఆయన అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డారు. దాంతో శివాజీని అరెస్ట్ చేసి విచారించి ఆపరేషన్ గరుడ నిజాలను రాబట్టాలన్న డిమాండ్ పెరుగుతోంది. కానీ జగన్‌పై దాడి సమయానికి శివాజీ అమెరికా వెళ్లిపోయారు. అక్కడి నుంచే టీవీ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

జగన్‌పై దాడి తర్వాత శివాజీ ఇప్పుడు బహిరంగంగానే చంద్రబాబు పాలనను పొగుడుతున్నారు. ఏడాది క్రితం ఇదే శివాజీ చంద్రబాబు పాలనపై చేయని ఆరోపణ లేదు. రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు మాత్రం గొంతు మారింది. తన జోలికి వస్తే వైసీపీకే నష్టమంటూ హెచ్చరించిన శివాజీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాను టీటీడీ చైర్మన్‌ అయి తీరుతానని ప్రకటించారు. కొమ్ములు తిరిగిన వారే టీటీడీ చైర్మన్ పదవిని అందుకోలేక చతికల పడుతున్నారు. అలాంటిది శివాజీ మాత్రం తాను చచ్చేలోపు టీటీడీ చైర్మన్ అయి తీరుతానని చెబుతున్నారు.

అది తన చిన్ననాటి కోరిక అని కూడా చెప్పారు. చంద్రబాబు పాలనలో ప్రస్తుతం టీటీడీ క్లియర్‌గా, ఆహ్లాదకరంగా ఉందని చెప్పుకొచ్చారు. టీటీడీని రాజకీయ అవసరాల కోసం వాడుకోవద్దని హెచ్చరించారు. అయితే శివాజీ ఇంత ధీమాగా ఏకంగా టీటీడీ చైర్మన్ అవుతానని చెప్పడం చూసి ఆశ్చర్యపోతున్నారు.

ఆపరేషన్ గరుడలో కీలక పాత్రధారిగా ఉంటూ…. తనకు అండగా మద్దతుగా ఉన్న శివాజీకి అందుకు ప్రతిఫలంగా చంద్రబాబు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆపరేషన్ గరుడ అన్నది చాలా పెద్ద ఆపరేషన్‌ కాబట్టి అందులో కీలకంగా ఉన్న శివాజీకి టీడీడీ చైర్మన్‌ లాంటి పదవి కూడా చిన్నదే అంటున్నారు.

First Published:  31 Oct 2018 11:17 PM GMT
Next Story