Telugu Global
Cinema & Entertainment

యంగ్ డైరెక్టర్ కి ఐ లవ్ యూ అని చెప్పిన సమంతా

అక్కినేని సమంతా తన కెరీర్ లో తొలి సారి లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించింది. అదే “యు టర్న్”. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంత పెద్ద హిట్ అవకున్న కూడా సమంతా కి నటిగా మంచి పేరు తీసుకొని వచ్చింది. దాంతో ఆ సినిమా అంటే ఇష్టం అలాగే ఆ సినిమాకు దర్శకత్వం వహించిన పవన్ కుమార్ అంటే మరింత ఇష్టమని అంటోంది. పవన్ కుమార్ వర్కింగ్ స్టైల్ సమంతకు నచ్చడంతో అతడికి జన్మదిన […]

యంగ్ డైరెక్టర్ కి ఐ లవ్ యూ అని చెప్పిన సమంతా
X

అక్కినేని సమంతా తన కెరీర్ లో తొలి సారి లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించింది. అదే “యు టర్న్”. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంత పెద్ద హిట్ అవకున్న కూడా సమంతా కి నటిగా మంచి పేరు తీసుకొని వచ్చింది. దాంతో ఆ సినిమా అంటే ఇష్టం అలాగే ఆ సినిమాకు దర్శకత్వం వహించిన పవన్ కుమార్ అంటే మరింత ఇష్టమని అంటోంది.

పవన్ కుమార్ వర్కింగ్ స్టైల్ సమంతకు నచ్చడంతో అతడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఐ లవ్ యు మై ఫ్రెండ్ అని ట్వీట్ చేసింది. ఇంకేముంది ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. నాగ చైతన్యాని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంతా ఇప్పుడు ఇలా ఒక కుర్ర డైరెక్టర్ కి ఐ లవ్ యు చెప్పడం అనేది తప్పుగా అనిపిస్తుంది అభిమానులకి. పైగా కొంతమంది నెటిజన్ లు సమంత ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఇదిలా ఉంటే మొన్ననే ఒక విషయం లో తనని జడ్జ్ చేసినందుకు అభిమానులకి మిడిల్ ఫింగర్ చూపించిన సమంతా… మరి ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

First Published:  1 Nov 2018 12:19 PM GMT
Next Story