Telugu Global
Cinema & Entertainment

సోనాలి బింద్రేను పరామర్శించిన నమ్రత

సోనాలి బింద్రే.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. నాగ్ సరసన మన్మధుడు, మహేష్ సరసన మురారి, చిరంజీవి సరసన ఇంద్ర లాంటి ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఈమధ్య తనకు కాన్సర్ సోకిందనే విషయాన్ని బయటపెట్టిన సోనాలి, ప్రస్తుతం న్యూయార్క్ లో దానికి సంబంధించిన ట్రీట్ మెంట్ తీసుకుంటోంది. టాలీవుడ్ నుంచి నాగార్జున లాంటి ప్రముఖులు సోనాలికి సోషల్ మీడియాలో ధైర్యం చెప్పారు. కానీ ఆమెను పరామర్శించడానికి మాత్రం వెళ్లలేదు. […]

సోనాలి బింద్రేను పరామర్శించిన నమ్రత
X

సోనాలి బింద్రే.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. నాగ్ సరసన మన్మధుడు, మహేష్ సరసన మురారి, చిరంజీవి సరసన ఇంద్ర లాంటి ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఈమధ్య తనకు కాన్సర్ సోకిందనే విషయాన్ని బయటపెట్టిన సోనాలి, ప్రస్తుతం న్యూయార్క్ లో దానికి సంబంధించిన ట్రీట్ మెంట్ తీసుకుంటోంది.

టాలీవుడ్ నుంచి నాగార్జున లాంటి ప్రముఖులు సోనాలికి సోషల్ మీడియాలో ధైర్యం చెప్పారు. కానీ ఆమెను పరామర్శించడానికి మాత్రం వెళ్లలేదు. ఈ లిస్ట్ లో మొట్టమొదటి పేరు నమ్రతా శిరోద్కర్. అవును..మహేష్ భార్య నమ్రత సోనాలీని పరామర్శించింది. ఆమెకు ధైర్యం చెప్పింది.

ప్రస్తుతం నమ్రత న్యూయార్క్ లోనే ఉంది. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న మహర్షి సినిమా షూటింగ్ జరుగుతోందక్కడ. ఈ షూటింగ్ తో పాటు కుటుంబంతో జాలీగా గడిపేందుకు న్యూయార్క్ వెళ్లాడు మహేష్. ఓ వైపు మహేష్ సెట్స్ లో బిజీగా ఉన్న టైమ్ లో, నమ్రత ఇలా హాస్పిటల్ కు వెళ్లి సోనాలీని కలిసి వచ్చింది. ఆమె చాలా ధైర్యంగా, స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకొచ్చింది నమ్రత.

First Published:  31 Oct 2018 9:50 PM GMT
Next Story