Telugu Global
NEWS

చిటికేస్తే బాబు ఢిల్లీకి వచ్చాడు....

ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న బీజీపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మరో సంచలన వ్యాఖ్య చేశారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబును ఉద్దేశించి తెలుగు వారి ఆత్మగౌరవంపై సంచలన కామెంట్లు చేశారు. ఎంతో అనుభవమున్న చంద్రబాబు…. బచ్చా చిటికేస్తే ఢిల్లీకి పరుగులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. జీవీఎల్ ట్విట్టర్ లో ‘‘చంద్రబాబు నాయుడు గారు 1978లో ఎమ్మెల్యే అయ్యారు. 1980లో మంత్రి అయ్యారు. అప్పుడు 5ఏళ్ల వయసున్న అఖిలేష్ యాదవ్ డైపర్లు వేసుకునే వాడు. అందరికంటే సీనియర్ అని చెప్పుకునే […]

చిటికేస్తే బాబు ఢిల్లీకి వచ్చాడు....
X

ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న బీజీపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మరో సంచలన వ్యాఖ్య చేశారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబును ఉద్దేశించి తెలుగు వారి ఆత్మగౌరవంపై సంచలన కామెంట్లు చేశారు. ఎంతో అనుభవమున్న చంద్రబాబు…. బచ్చా చిటికేస్తే ఢిల్లీకి పరుగులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు.

జీవీఎల్ ట్విట్టర్ లో ‘‘చంద్రబాబు నాయుడు గారు 1978లో ఎమ్మెల్యే అయ్యారు. 1980లో మంత్రి అయ్యారు. అప్పుడు 5ఏళ్ల వయసున్న అఖిలేష్ యాదవ్ డైపర్లు వేసుకునే వాడు. అందరికంటే సీనియర్ అని చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు… ‘బచ్చా’ అఖిలేష్ యాదవ్ చిటికేస్తే ఢిల్లీకి వెళ్లడం సిగ్గనిపించడం లేదా? ఇది తెలుగువారి ఆత్మగౌరవారం దెబ్బ తీసినట్లు కాదా?’’ అని పోస్ట్ చేశారు.

తెలుగు వారికి బీజేపీ తగిన స్థానం కల్పించడం లేదని లోకేష్ ట్విట్టర్ లో పేర్కొనడం పై జీవీఎల్ స్పందించారు. టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అవినీతిలో కూరుకుపోయారు… సీబీఐ దాడులు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి మరో అవినీతి కూటమి ఏర్పాటుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని జీవీఎల్ పేర్కొన్నారు.

స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ అంశంపై స్పందించిన జీవీఎల్… విగ్రహ ఏర్పాటుకు రూ.2,333 కోట్లు అవుతుంటే, అందులో కేంద్రం కేవలం రూ.300 కోట్లు మాత్రమే ఇస్తుందని, కానీ టీడీపీ ప్రభుత్వం రూ.3000 కోట్లుగా ప్రచారం చేస్తుందని జీవీఎల్ పేర్కొన్నారు.

గుజరాత్ కంటే కృష్ణ పట్నానికే కేంద్రం ఎక్కువ నిధులు ఇస్తుందని చెప్పారు. ఎన్టీఆర్ ఫొటో లేకుండా చంద్రబాబు ఎన్నికల్లో పోటీ చేయగలరా అని గతంలో ప్రశ్నించిన ఆయన, ఇప్పుడు చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు.

First Published:  1 Nov 2018 5:12 AM GMT
Next Story