Telugu Global
Cinema & Entertainment

ప్రాధాన్యత లేని పాత్రలో ఇలియానా ?

శ్రీనువైట్ల, రవితేజ లాంటి మాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా “అమర్ అక్బర్ అంటోనీ”. చాలా కాలం తరువాత వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో ఈ సినిమా పై అందరిలోనూ భారి అంచనాలు పెరిగాయి.అయితే సినిమాలో ఇలియానాది చాలా తక్కువ నిడివి ఉన్న పాత్రనీ సమాచారం. ట్రైలర్‌ని బట్టి చూస్తే ఇదో క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీలా అనిపిస్తోంది. రవితేజ మూడు డిఫరెంట్‌ వేరియేషన్స్‌లో కనిపిస్తున్నాడు. కానీ హీరోయిన్‌ ఒక్క ఇలియానా మాత్రమే. ట్రైలర్‌లో రెండు మూడు […]

ప్రాధాన్యత లేని పాత్రలో ఇలియానా ?
X

శ్రీనువైట్ల, రవితేజ లాంటి మాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా “అమర్ అక్బర్ అంటోనీ”. చాలా కాలం తరువాత వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో ఈ సినిమా పై అందరిలోనూ భారి అంచనాలు పెరిగాయి.అయితే సినిమాలో ఇలియానాది చాలా తక్కువ నిడివి ఉన్న పాత్రనీ సమాచారం. ట్రైలర్‌ని బట్టి చూస్తే ఇదో క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీలా అనిపిస్తోంది.

రవితేజ మూడు డిఫరెంట్‌ వేరియేషన్స్‌లో కనిపిస్తున్నాడు. కానీ హీరోయిన్‌ ఒక్క ఇలియానా మాత్రమే. ట్రైలర్‌లో రెండు మూడు చోట్ల ఇలియానాకి చోటు దక్కింది కానీ, సినిమాలో అంత సీను ఉండదంటూ ప్రచారం జరుగుతోంది. మొదట్లో ఈ సినిమాలో హీరోయిన్‌గా అనూ ఎమ్మాన్యుఎల్ ని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అనూ ఈ సినిమా నుండి తప్పుకోవడంతో ఆ ప్లేస్‌లోకి ఇలియానా వచ్చి చేరింది. చాల రోజుల తరువాత తెలుగు తేర పై హీరోయిన్ గా ఇలియానా వస్తుండటంతో అందరూ ఎక్కువ ద్రుష్టి ఇలియానా పాత్రపై కూడా పెట్టారు. మరి ఒక రకంగా ఈ న్యూస్ ఇలియానా అభిమానులకి చేదు వార్తే అని చెప్పాలి. ఈ సినిమా నవంబర్ 16 న రిలీజ్ కానుంది.

First Published:  31 Oct 2018 2:31 AM GMT
Next Story