Telugu Global
NEWS

మూడు రోజుల్లో 40 ప్రెస్‌ మీట్లా?

ఆపరేషన్ గరుడా అంటూ ముందే విషయాలు చెప్పిన పెయిడ్ ఆర్టిస్ శివాజీని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని వైసీపీ నేత సుధాకర్ బాబు ప్రశ్నించారు. పెయిడ్‌ ఆర్టిస్టును అరెస్ట్‌ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయనే అతడిని అమెరికా పంపించారని అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే పెయిడ్ ఆర్టిస్ట్ శివాజీని ఇండియాకు రప్పించి అరెస్ట్ చేసి విచారించి జగన్‌పై దాడి వెనుక ఎవరున్నారో తేల్చాలని డిమాండ్ చేశారు. జగన్‌పై హత్యాయత్నం కేసులో చంద్రబాబే తొలి ముద్దాయి అని […]

మూడు రోజుల్లో 40 ప్రెస్‌ మీట్లా?
X

ఆపరేషన్ గరుడా అంటూ ముందే విషయాలు చెప్పిన పెయిడ్ ఆర్టిస్ శివాజీని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని వైసీపీ నేత సుధాకర్ బాబు ప్రశ్నించారు. పెయిడ్‌ ఆర్టిస్టును అరెస్ట్‌ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయనే అతడిని అమెరికా పంపించారని అనుమానం వ్యక్తం చేశారు.

వెంటనే పెయిడ్ ఆర్టిస్ట్ శివాజీని ఇండియాకు రప్పించి అరెస్ట్ చేసి విచారించి జగన్‌పై దాడి వెనుక ఎవరున్నారో తేల్చాలని డిమాండ్ చేశారు. జగన్‌పై హత్యాయత్నం కేసులో చంద్రబాబే తొలి ముద్దాయి అని సుధాకర్ బాబు ఆరోపించారు. వైఎస్ విజయమ్మ, షర్మిల కలిసి జగన్‌ను హత్య చేసి పార్టీ పగ్గాలు తీసుకునేందుకు కుట్ర చేశారని టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేందప్రసాద్ చేసిన వ్యాఖ్యలపైనా సుధాకర్ బాబు తీవ్రంగా స్పందించారు.

ఇంతగా దిగజారిపోయి మాట్లాడుతున్న టీడీపీ నేతలను ఏమనాలని ప్రశ్నించారు. బాబు రాజేందప్రసాద్‌ దద్దమ్మ మాటలు, అటుఇటు కానీ మాటలు మానుకోవాలన్నారు. పిచ్చికుక్కలా వాగుతున్న రాజేంద్రప్రసాద్ నోరు కడిగేందుకు ఫినాయిల్ తయారు చేసే కంపెనీలన్నీ ఆలోచించి కొత్తగా ఒక మందు కనిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. జగన్‌పై హత్యాయత్నం తర్వాత టీడీపీ నేతలు ఎంతగా దిగజారి మాట్లాడుతున్నారో రాష్ట్రంలో ఆడపడుచులందరూ గమనించాలని కోరారు.

జగన్‌పై హత్యాయత్నం తర్వాత టీడీపీ నేతల వ్యవహారశైలి చూస్తుంటే తమ దేవుడు వైఎస్‌ను కూడా ఇదే తరహాలో కుట్ర చేసి చంపారేమో అనిపిస్తోందన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌ కలిసి పోటీచేస్తున్న ఉదంతం చూసిన తర్వాత ఆ అనుమానాలు మరింత బలపడుతున్నాయన్నారు. బాబు రాజేంద్రప్రసాద్‌కు ఒక కన్ను మాత్రమే బాగుందని… రెండో కంటికి కూడా ఆపరేషన్ చేయించుకుని అప్పుడు మాట్లాడాలన్నారు.

రాజేంద్రప్రసాద్‌ను బట్టలూడదీసి కొట్టే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. జగన్‌పై హత్యాయత్నం తర్వాత టీడీపీ నేతలు మూడు రోజులలో 40 ప్రెస్‌మీట్లు పెట్టారంటే … చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు వారు ఎంతగా ప్రయత్నిస్తున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు సుధాకర్ బాబు.

First Published:  30 Oct 2018 12:00 AM GMT
Next Story