Telugu Global
Cinema & Entertainment

యషిక ఆనంద్ ను వేధించిన ఆ దర్శకుడెవరు?

ఒక తమిళ దర్శకుడు నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని నాపై అతడికి అలాంటి ఉద్దేశం ఉన్నట్లు… ఇబ్బందికరమైన సైగలు చేసి చెప్పాడని అందుకే అతడికి దూరంగా ఉన్నాను అని యషిక ఆనంద్ ఒక‌ డైరెక్టర్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. యషిక ఆనంద్ “నోటా” సినిమాలో విజయ్ దేవరకొండ తో పాటు నటించింది. అయితే ఈ చిత్రం అటు తమిళ్ లో కానీ ఇటు తెలుగులో కానీ హిట్ కాలేకపోయింది. దాంతో ఈ భామకు అంతగా క్రేజ్ […]

యషిక ఆనంద్ ను వేధించిన ఆ దర్శకుడెవరు?
X

ఒక తమిళ దర్శకుడు నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని నాపై అతడికి అలాంటి ఉద్దేశం ఉన్నట్లు… ఇబ్బందికరమైన సైగలు చేసి చెప్పాడని అందుకే అతడికి దూరంగా ఉన్నాను అని యషిక ఆనంద్ ఒక‌ డైరెక్టర్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. యషిక ఆనంద్ “నోటా” సినిమాలో విజయ్ దేవరకొండ తో పాటు నటించింది. అయితే ఈ చిత్రం అటు తమిళ్ లో కానీ ఇటు తెలుగులో కానీ హిట్ కాలేకపోయింది. దాంతో ఈ భామకు అంతగా క్రేజ్ రాలేదు.

ఓ పాపులర్ దర్శకుడు నన్ను వేదించాడు అని చెప్పింది , కానీ అతడి పేరు చెప్పకపోవడం వల్ల ఎవరికి వాళ్ళు ఇతనై ఉంటాడా లేక అతనై ఉంటాడా అంటూ రకరకాలుగా అనుకుంటున్నారు అందరూ. ఇప్పుడున్న ఈ మీటూ ఉద్యమంలో అసలు ఎప్పుడు ఏ డైరెక్టర్ పేరు బయటకి వస్తుందో ఏ హీరో పేరు బయటకి వస్తుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. చూద్దాం ఈ మీటూ ఉద్యమం ఇలాంటి పేర్లను ఇంకెంత మంది హీరోయిన్స్ బయటకి తీసుకొని వస్తారో.

First Published:  30 Oct 2018 1:14 AM GMT
Next Story