Telugu Global
NEWS

మేం రాష్ట్రపతి పాలన కోరడం లేదు " విజయసాయిరెడ్డి

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రిని వైసీపీ నేతల బృందం కలిసింది. జగన్‌పై హత్యాయత్నం, ఆ తర్వాత ఏపీ పోలీసులు, చంద్రబాబు తీరును రాజ్‌నాథ్‌ సింగ్‌కు వివరించారు. జగన్‌పై దాడి జరిగింది కేంద్ర పరిధిలోని ఎయిర్‌పోర్టులో కాబట్టి అది తమ పరిధిలోకి రాదని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను రాజ్‌నాథ్‌ సింగ్‌ దృష్టికి తీసుకెళ్లారు. దాడికి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని చంద్రబాబు చెబుతున్న నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకుని దర్యాప్తు చేయించాల్సిందిగా కోరారు. దాడికి కేంద్రానిదే […]

మేం రాష్ట్రపతి పాలన కోరడం లేదు  విజయసాయిరెడ్డి
X

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రిని వైసీపీ నేతల బృందం కలిసింది. జగన్‌పై హత్యాయత్నం, ఆ తర్వాత ఏపీ పోలీసులు, చంద్రబాబు తీరును రాజ్‌నాథ్‌ సింగ్‌కు వివరించారు.

జగన్‌పై దాడి జరిగింది కేంద్ర పరిధిలోని ఎయిర్‌పోర్టులో కాబట్టి అది తమ పరిధిలోకి రాదని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను రాజ్‌నాథ్‌ సింగ్‌ దృష్టికి తీసుకెళ్లారు. దాడికి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని చంద్రబాబు చెబుతున్న నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకుని దర్యాప్తు చేయించాల్సిందిగా కోరారు.

దాడికి కేంద్రానిదే బాధ్యత అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను రాజ్‌నాథ్‌ సింగ్‌కు వివరించడంతో ఆయన సానుకూలంగా స్పందించారని వైసీపీ మాజీ ఎంపీ సుబ్బారెడ్డి చెప్పారు. ఆపరేషన్ గరుడ వెనుక ఎవరున్నారో తేల్చాలని రాజ్‌నాథ్‌ సింగ్‌ కు విజ్ఞప్తి చేశామన్నారు.

జగన్‌కు ప్రాణహాని తలపెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వమే ప్రయత్నించిన నేపథ్యంలో జగన్‌కు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాల్సిందిగా కోరామన్నారు. చంద్రబాబే విచారణ బాధ్యత కేంద్రానిది అని చెప్పినందున తాము జోక్యం చేసుకునేందుకు ఉన్నతాధికారులతో చర్చిస్తామని రాజ్‌ నాథ్‌ సింగ్ హామీ ఇచ్చారు.

దాడి జరిగిన వెంటనే డీజీపీ మీడియా ముందుకు వచ్చి పబ్లిసిటీ కోసం జగన్‌ అభిమానే చేశారని చెప్పడం బట్టే అనుమానాలు కలుగుతున్నాయని రాజ్‌నాథ్‌ సింగ్‌కు వివరించారు.

టీడీపీ మంత్రులు, ఎంపీలు ఏకంగా తాము అనుకుంటే జగన్‌ను కైమా కైమా చేయిస్తామని, పిల్లకుంకలతో కాకుండా పెద్ద స్థాయిలోనే ప్లాన్‌ చేసేవారిమని చెప్పిన వ్యాఖ్యలను కూడా రాజ్‌నాథ్‌ సింగ్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఘటన కేంద్ర పరిధిలో ఉందని చంద్రబాబే చెప్పినందున కేంద్రం వైపు నుంచి ఏం చేయాలో అది చేస్తామని రాజ్‌నాథ్‌ సింగ్ చెప్పారని మేకపాటి రాజమోహన్ రెడ్డి వివరించారు.

చంద్రబాబు నాయకత్వంలోని ఏపీ పోలీసు వ్యవస్థపై నమ్మకం లేదని తాము రాజ్‌నాథ్‌ సింగ్‌కు వైసీపీ నేతలు చెప్పారు. దాడి జరిగిన వెంటనే డీజీపీ, చంద్రబాబు వ్యాఖ్యలు చూసిన తర్వాత ఏపీ ప్రభుత్వంపై నమ్మకం పోయిందన్నారు.

మేం రాష్ట్రపతి పాలన కోరడం లేదు…

జగన్‌పై హత్యాయత్నం వెనుక చంద్రబాబు, లోకేష్, డీజీపీ ప్రమేయం ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన తర్వాత మాట్లాడిన ఆయన… థర్డ్‌ పార్టీతో విచారణ జరిపించాల్సిందిగా హోంమంత్రిని కోరామన్నారు. చంద్రబాబు ఒక మానసిక రోగిగా మారిపోయారని విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు.

రాష్ట్రపతి పాలన విధించేందుకు కుట్ర చేస్తున్నారని చంద్రబాబు పదేపదే చెబుతున్నారని.. కానీ తాము ఏపీలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయడం లేదని… కేవలం జగన్‌పై హత్యాయత్నంపై సరైన దర్యాప్తును మాత్రమే కోరుతున్నామని విజయసాయిరెడ్డి చెప్పారు. చంద్రబాబు మానసిక రోగి అని.. అల్జిమర్స్‌తో బాధపడుతూ రాష్ట్రాన్ని ఇబ్బందిపెడుతున్నారని విమర్శించారు.

First Published:  28 Oct 2018 11:56 PM GMT
Next Story