Telugu Global
Cinema & Entertainment

"భారతీయుడు 2" లో కాజల్ అగర్వాల్

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం యంగ్ హీరో అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఇవి షూటింగ్ దశలో ఉండగానే కమల్ హసన్ సరసన “భారతీయుడు 2” లో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది కాజల్ అగర్వాల్. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ రెమ్యూనరేషన్ విషయంలో చర్చలు సాగుతున్నాయట. ఈ సినిమాలో కమల్ హసన్ డబల్ రోల్ చేస్తున్నాడు. మరి […]

భారతీయుడు 2 లో కాజల్ అగర్వాల్
X

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం యంగ్ హీరో అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఇవి షూటింగ్ దశలో ఉండగానే కమల్ హసన్ సరసన “భారతీయుడు 2” లో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది కాజల్ అగర్వాల్.

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ రెమ్యూనరేషన్ విషయంలో చర్చలు సాగుతున్నాయట. ఈ సినిమాలో కమల్ హసన్ డబల్ రోల్ చేస్తున్నాడు. మరి కాజల్ పెద్ద కమల్ హాసన్ కు జోడీగా నా లేదా యంగ్ కమల్ క్యారక్టర్ కు జతగానా అన్నది క్లారిటీ లేదు. ఏదేమైనా కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటుడి తో కలిసి నటించే అవకాశం లేటుగా అయినా దొరకడం అదృష్టమే అని చెప్పుకోవాలి.

ఒక వైపు తెలుగు లో కుర్ర హీరోలతో సినిమాలు చేస్తూనే మళ్ళి తమిళ్ లో స్టార్ హీరోస్ తో అవకాశాలు దక్కించుకుంటుంది కాజల్ అగర్వాల్. శంకర్ డైరెక్ట్ చేస్తున్న “భారతీయుడు 2” ని లైకా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

First Published:  28 Oct 2018 11:03 PM GMT
Next Story