Telugu Global
NEWS

గాలి జనార్దన్‌ రెడ్డి పరామర్శకు.... నో అన్న జగన్‌

విశాఖపట్టణం విమానాశ్రయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డి పై కత్తితో దాడి జరిగిందన్న వార్త తెలియగానే బళ్ళారికి చెందిన గాలి జనార్దన్‌ రెడ్డి ఆవేదన చెందారు. సోదరుడిలాంటి జగన్‌ పరిస్థితి ఎలా ఉందో ఆయన ఎప్పటికప్పుడు వాకబు చేస్తూనే హత్యాయత్నం జరిగిన రోజు (ఈ నెల 25వ తేదీన) సాయంత్రం 6 గంటల కల్లా బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు విమానంలో హుటాహుటిన చేరుకున్నారు. జగన్‌ను పరామర్శించాలని, ఆయన్ను ప్రత్యక్షంగా పలుకరించి స్వాంతన చేకూర్చాలని భావించారు. […]

గాలి జనార్దన్‌ రెడ్డి పరామర్శకు.... నో అన్న జగన్‌
X

విశాఖపట్టణం విమానాశ్రయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డి పై కత్తితో దాడి జరిగిందన్న వార్త తెలియగానే బళ్ళారికి చెందిన గాలి జనార్దన్‌ రెడ్డి ఆవేదన చెందారు. సోదరుడిలాంటి జగన్‌ పరిస్థితి ఎలా ఉందో ఆయన ఎప్పటికప్పుడు వాకబు చేస్తూనే హత్యాయత్నం జరిగిన రోజు (ఈ నెల 25వ తేదీన) సాయంత్రం 6 గంటల కల్లా బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు విమానంలో హుటాహుటిన చేరుకున్నారు.

జగన్‌ను పరామర్శించాలని, ఆయన్ను ప్రత్యక్షంగా పలుకరించి స్వాంతన చేకూర్చాలని భావించారు. ఆ మేరకు గాలి జానర్దన్‌రెడ్డి జగన్‌కు మధ్యవర్తుల (తనకూ, జగన్‌కూ సన్నిహితులైన వారు) ద్వారా కబురు పెడుతూ తాను ఆసుపత్రికి వచ్చి కలవాలనుకుంటున్నట్లు సమాచారం పంపారు. కానీ జగన్‌ మాత్రం అందుకు నిర్ద్వంద్వంగా తోసి పుచ్చారు.

జనార్దన్‌ రెడ్డిని కలుసుకునే సాహసం చేయలేకపోయారు. తనను పరామర్శించాలనుకుంటున్నందుకు గాలికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జనార్దన్‌రెడ్డి తన వద్దకు వచ్చి యోగక్షేమాలు తెలుసుకుని వెళితే… తన వ్యతిరేక మీడియా తనపై దాడి జరిగిన అంశాన్ని మరుగున పరచి గాలి-జగన్‌ భేటీ అంటూ తాటాకులు కడుతుందని జగన్‌ భయపడ్డారని అంతరంగిక వర్గాలు చెబుతున్నాయి.

జనార్దన్‌ రెడ్డి మాత్రం ఎవరు ఎలాంటి ప్రచారం చేసినా తమ కలయికను భూతద్దంలో వేసి చూపించినా భయపడాల్సిన పని లేదని, ఆత్మీయులకు ఆపద సంభవించినపుడు కలుసుకోలేక పోతే మానవత్వం అనిపించుకోదని మొండిగా జగన్‌ను కలవాలనే అనుకున్నారు కానీ జగన్‌ అయిష్టత వల్ల అది సాధ్యపడలేదు.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అంతకు ముందు కాలంలో గాలి-వైఎస్‌ల మధ్య అనుబంధం ఎలా ఉండేదన్నది ఎవరికీ తెలియనిదేమీ కాదు.

ఓబుళాపురం మైనింగ్‌ వ్యవహారాలు – ఇప్పటికీ అమలుకు నోచుకోని బ్రహ్మణి స్టీల్‌ ఫ్యాక్టరీ (కడపలో) స్థాపన వంటి విషయాల్లో గాలిని అప్పట్లో వైఎస్ ప్రోత్సహించారు. అయితే వైఎస్‌ మరణం తరువాత గాలిపై కత్తి గట్టిన కాంగ్రెస్‌ పార్టీ అప్పటి కె. రోశయ్య ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని సీబీఐ ద్వారా కేసులను నడిపించారు.

ఈ వ్యవహారంలో చాలా కాలం పాటు జనార్దన్‌ రెడ్డి జైల్లో గడపడం, ఓ సామాజిక వర్గ మీడియా పని గట్టుకుని వ్యతిరేక కథనాలు నడపడం రహస్యమేమీ కాదు. గాలి అరెస్టు అయిన తరుణంలోనే జగన్‌ను ఆ విషయం ప్రశ్నించగా జనార్దన్‌రెడ్డి ఎవరో తనకు తెలియదన్నట్లు అప్పట్లో మీడియాకు సమాధానం ఇచ్చారు.

గాలి గురించి మాట్లాడితే తనకు ఎక్కడ చెడ్డపేరు వస్తుందోనని అప్పట్లో జగన్‌ భావించారు. కానీ ఆ తరువాత కొద్ది నెలలకే గాలి తరహాలోనే అప్పటి కేంద్ర (కాంగ్రెస్‌) ప్రభుత్వం జగన్‌ను కూడా జైల్లో పెట్టింది. వైఎస్‌ మరణం తరువాత పరిణామాల్లో, తాను సొంతంగా రాజకీయ పార్టీ పెట్టినపుడు ఏదో రకంగా తనను కేసుల్లో ఇరికించి ఇబ్బందుల పాలు చేస్తారని తొలి నుంచీ అనుమానిస్తూ వచ్చిన జగన్‌ తన సంబంధాల విషయంలో చాలా ఆచితూచి వ్యవహరించారు.

వైఎస్‌ మరణించిన వెంటనే కర్నూలు ప్రాంతంలో విపరీతంగా వరదలు వచ్చి జనజీవనం అతలాకుతలం అయింది. అప్పట్లో జగన్‌ యాజమాన్యంలోని సాక్షి దిన పత్రిక బాధితుల సహాయార్థం నిధి సేకరణకు పిలుపు నిస్తే గాలి జనార్దన్‌రెడ్డి తన వంతు విరాళంగా అక్షరాలా రూ. 1 కోటి పంపారు. తొలుత స్వీకరించిన సాక్షి యాజమాన్యం ఆ తరువాతి క్రమంలో గాలి చుట్టూ ఉచ్చు బిగిస్తున్నదనీ, ఆయనను నిర్భందిస్తారనీ ముందుగానే గ్రహించి కొద్దినెలల తరువాత ఆ సొమ్మును వడ్డీతో సహా వెనక్కి పంపారు.

అప్పుడే గాలి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ…. జగన్‌ ను తాను అభిమానిస్తూ ఉంటే ఆయన మాత్రం తనను ఇలా అవమానిస్తున్నాడని అంతరంగికుల వద్ద వాపోయారని అప్పట్లో చర్చ జరిగింది. గాలి జైలుకు పోవడం, విడుదలై మళ్ళీ రాజకీయాల్లో క్రియాశీలంగా పాల్గొంటున్న నేపథ్యంలో గాలి, జగన్‌తో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించినా ఎందుకనో యువనేత మాత్రం దూరంగానే ఉంచుతున్నారు.

వీరిద్దరి మీద అప్పట్లో దురుద్దేశ్యంతో మోపిన కేసుల విచారణ కోసం జగన్‌, గాలి, విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి…. ఇలా అందరూ సీబీఐ కోర్టుకు హాజరై ఎదురు పడుతున్నా…. జగన్‌ మాత్రం గాలిని పలుకరించడానికి సైతం ఇష్టపడలేదు. కొన్ని రోజులైతే విజయసాయిరెడ్డి కూడా గాలిని చూసి పక్కకు తప్పుకునే వారు. కానీ క్రమంగా ఇపుడు సాయిరెడ్డి, జనార్దన్‌రెడ్డి ని సీబీఐ కోర్టు కారిడార్‌లో కులాసాగా పలుకరిస్తూ కబుర్లాడుతున్నారు.

జగన్‌ కోసం గాలి ఆరాట పడుతున్నా యువనేత ఎడంగా ఉండటం వారిద్దరినీ అభిమానించే వారికి బాధ కలిగిస్తోంది. జనార్దన్‌ రెడ్డి కనుక ఈ తరుణంలో జగన్‌ను కలిసి ఉంటే ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మంచి ఊపు ఉండేదని కూడా గాలి అనుచరులు అభిప్రాయపడుతున్నారు. గతంలో కర్నూలుకు చెందిన గౌరు వెంకటరెడ్డి నిందితుడుగా జైలులో శిక్షను అనుభవిస్తున్నపుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎవరేమనుకున్నా లెక్క చేయకుండా ప్రతిపక్ష నేత హోదాలో జైలుకు వెళ్ళి కలిసి ధైర్యం చెప్పి వచ్చారు.

అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగినా వైఎస్‌ తూఛ్‌… అన్నారు. వైఎస్‌ అంతటి తెగువ జగన్‌, గాలి విషయంలో ప్రదర్శించలేక పోయారనేది నిఖార్సయిన వాస్తవం. జగన్‌, గాలి నుంచి ఎంత ఎడంగా ఉన్నా వారిద్ధరికీ మధ్య సంబంధాలు లేనే లేవు అంటే మీడియా నమ్ముతుందా?

First Published:  29 Oct 2018 12:32 AM GMT
Next Story