Telugu Global
NEWS

ఒకటో తారీఖు.... అందరి నేతల చూపు ఆరోజు మీదే

డిసెంబర్ 7న జరిగే ఎన్నికల కోసం టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి నెలరోజులు దాటిపోయింది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లోని పట్టణాలు, పల్లెల్లో ఆ పార్టీ ఆధ్వర్యంలో ఒక దఫా ప్రచారమూ పూర్తయ్యింది. కానీ మహాకూటమి అభ్యర్థులెవరో తేలలేదు. పొత్తుల్లో భాగంగా ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు.? ఏ నేతలకు టికెట్లు దక్కుతాయనేది నిన్నటికి ఓ క్లారిటీకి వచ్చింది. కానీ అధికారికంగా ప్రకటన మాత్రం జారీ కాలేదు. ఫలితంగా ఒక రకమైన స్తబ్ధత నెలకొంది. మహాకూటమి సీట్ల ఖరారుపై […]

ఒకటో తారీఖు.... అందరి నేతల చూపు ఆరోజు మీదే
X

డిసెంబర్ 7న జరిగే ఎన్నికల కోసం టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి నెలరోజులు దాటిపోయింది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లోని పట్టణాలు, పల్లెల్లో ఆ పార్టీ ఆధ్వర్యంలో ఒక దఫా ప్రచారమూ పూర్తయ్యింది. కానీ మహాకూటమి అభ్యర్థులెవరో తేలలేదు. పొత్తుల్లో భాగంగా ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు.? ఏ నేతలకు టికెట్లు దక్కుతాయనేది నిన్నటికి ఓ క్లారిటీకి వచ్చింది. కానీ అధికారికంగా ప్రకటన మాత్రం జారీ కాలేదు. ఫలితంగా ఒక రకమైన స్తబ్ధత నెలకొంది.

మహాకూటమి సీట్ల ఖరారుపై ఉత్కంఠకు తెరదించుతూ నవంబర్ 1న టికెట్ల ప్రకటన చేయనున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం తాజాగా సంకేతాలిచ్చింది. అదే రోజు మహాకూటమిలోని మిగిలిన పార్టీలూ తమ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా అందరి చూపు ఒకటో తారీఖుపై పడింది.

టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి నెలరోజులు గడిచిపోగా.. ముమ్మర ప్రచారం కొనసాగిస్తున్నారు. కానీ మహాకూటమి అభ్యర్థుల పరిస్థితి వేరేలా ఉంది. కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్, టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్నవారంతా ఎవరికి వారు అడపాదడపా ప్రచారం సాగిస్తున్నా… అందులో ఊపు కనిపించడం లేదు.

వాస్తవానికి జిల్లాల్లో ఏ స్థానం నుంచి ఏ పార్టీకి… అందులో ఎవరికి కేటాయిస్తారో తెలియక ఆయా పార్టీలకు చెందిన నేతలే గాక కార్యకర్తలు సైతం ఆగమవుతున్నారు. ఇప్పటికే పోటీ లో ఉన్నవారు గాక కొత్తగా ఎవరు.? ఎక్కడి నుంచి వచ్చి ఏ స్థానాన్ని కొట్టుకుపోతారనే టెన్షన్ లేకపోలేదు. దీంతో పైకి టికెట్ పై ధీమా వ్యక్తం చేస్తున్న పలువురు ఆశావహులు లోలోన ఆందోళన చెందుతున్నట్టు సమాచారం.

మరోవైపు తమ ప్రత్యర్థి ఎవరో తెలియక టీఆర్ఎస్ అభ్యర్థులు సైతం తలపట్టుకుంటున్నారు. ఎంత సేపు తమ గురించే కాదు…. ప్రత్యర్థి ని ఎండగడుదామని చూస్తుంటే అసలు కాంగ్రెస్ పార్టీ టికెట్లను ఖరారు చేయకుండా టీఆర్ఎస్ అభ్యర్థులకు సైతం పరీక్ష పెడుతోందట.

First Published:  29 Oct 2018 1:17 AM GMT
Next Story